Apple | దూకుడుమీదున్న యాపిల్.. భారత్‌లో నాలుగో రిటైల్ స్టోర్ ప్రకటించిన టెక్ దిగ్గజం.. ఎక్కడంటే..?
Apple | దిగ్గజ టెక్ కంపెనీ యాపిల్ (Apple) భారత్‌లో తన కార్యకలాపాలు మరింతగా విస్తరిస్తోంది. భారత్‌లో నాలుగో రిటైల్ స్టోర్‌ను యాపిల్ తాజాగా ప్రకటించింది.
Apple | దిగ్గజ టెక్ కంపెనీ యాపిల్ (Apple) భారత్‌లో తన కార్యకలాపాలు మరింతగా విస్తరిస్తోంది. ఐ-ఫోన్లు, ఇతర ఉత్పత్తులకు భారత్ బెస్ట్ మార్కెట్‌గా నిలిచిన నేపథ్యంలో ఇండియాలో తయారీ, విక్రయ కార్యకలాపాల్ని వేగంగా విస్తరిస్తోంది. ఇక ఢిల్లీ, ముంబైలో రిటైల్ స్టోర్ల (Apple Retail Store)ను తెరిచిన సంస్థ.. మూడో స్టోర్‌ను బెంగళూరు (Bengaluru)లో ఓపెన్ చేసేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 2వ తేదీన బెంగళూరులో తొలి రిటైల్ స్టోర్‌ను ప్రారంభించనున్నట్లు యాపిల్ గత వారం ప్రకటించింది. ఇప్పుడు భారత్‌లో నాలుగో రిటైల్ స్టోర్‌ను యాపిల్ తాజాగా ప్రకటించింది. పూణె (Pune)లో కోరెగావ్ పార్క్ ప్రాంతంలో సెప్టెంబర్ 4న ప్రారంభించనున్నట్లు మంగళవారం ప్రకటించింది.
యాపిల్ కళ్లు చెదిరే డీల్..
భారత్‌లో తయారీ, విక్రయ కార్యకలాపాల్ని వేగంగా విస్తరిస్తోన్న యాపిల్ సంస్థ.. బెంగళూరులో భారీ ఆఫీస్ స్పేస్‌ను లీజుకు తీసుకున్నట్లు ఇటీవలే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. రియల్ ఎస్టేట్ అనలిటిక్స్ సంస్థ ప్రాప్‌స్టాక్ ప్రకారం.. బెంగళూరు (Bengaluru)లో ఎంబసీ జెనిత్ భవనంలో 2.7 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని అద్దెకు తీసుకుంది. ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్ ఎంబసీ గ్రూప్ (Embassy Group)కు చెందిన కమర్షియల్ ప్రాజెక్టు ఎంబసీ జెనిత్ (Embassy Zenith)లోని ఆ కార్యాలయ స్థలం కోసం 10 ఏళ్ల కాలానికి యాపిల్ సంస్థ డీల్ కుదుర్చుకుంది.
9 అంతస్తుల్లో (5 నుంచి 13వ అంతస్తు వరకు) విస్తరించి ఉన్న ఈ ఆఫీస్ స్పేస్ కోసం యాపిల్ సంస్థ నెలకు రూ.6.3 కోట్ల అద్దె చెల్లించనుంది. ఏడాదికి 4.5 శాతం చొప్పున అద్దె పెంపుతో పార్కింగ్, మెయింటెనెన్స్ చార్జీలతో కలిపిమొత్తం ఈ పదేళ్లలో సంస్థ రూ.1,000 కోట్లను అద్దెగా చెల్లించేందుకు ఒప్పందం చేసుకుంది. 2025 ఏప్రిల్ 3 నుంచి ఈ లీజు అమల్లోకి వచ్చింది. ఈ లీజు ఒప్పందంలో భాగంగా యాపిల్ రూ.31.57 కోట్లు డిపాజిట్ కూడా చేసింది. కాగా, 2024-25 ఆర్థిక సంవత్సరంలో మన దేశం నుంచి అతి పెద్ద మొబైల్ ఫోన్ల ఎగుమతిదారుగా యాపిల్ నిలిచిన విషయం తెలిసిందే. సుమారు రూ.1.5 లక్షల కోట్ల విలువైన ఫోన్లను ఎగుమతి చేసింది.
Also Read..
Saurabh Bharadwaj: హాస్పిటల్ నిర్మాణంలో స్కామ్.. ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ ఇంట్లో ఈడీ తనిఖీలు
Landslide | అరుణాచల్ ప్రదేశ్‌లో కొండచరియల బీభత్సం.. వాహనాలపై పడిన బండరాళ్లు.. వీడియో
మోదీ సర్కారుపై కిసాన్ కదనశంఖం
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

