మనాలీ: హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh)పై మళ్లీ ప్రకృతి తన ప్రకోపాన్ని చూపించింది. తీవ్ర స్థాయి వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ వరదల వల్ల కిరాట్పూర్-మనాలీ జాతీయ హైవేపై నష్టం జరిగింది. దీంతో మండీ, మనాలీ లో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల .. బియాస్ నది ఉప్పొంగుతున్నది. దాని ఉప నదులు కూడా ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో ఎమర్జెన్సీ చర్యలు చేపడుతున్నారు. జాతీయ రహదారి పలు ప్రదేశాల్లో బ్లాక్ అయ్యింది.
Manali.
Only the front wall of Sher-e-Punjab is left…rest has all been taken away by the river.#HimachalPradesh #himachalrains #manali pic.twitter.com/D3QMNWiFOo
— Sidharth Shukla (@sidhshuk) August 26, 2025
మనాలీ సమీపంలో ఉన్న బిందు ధంక్ వద్ద బియాస్ నది వరద నీటికి జాతీయ హైవే కొట్టుకుపోయింది. దీంతో పాపులర్ టూరిస్టు కేంద్రానికి రాకపోకలు తెగిపోయాయి. మనాలీలో నది సమీపంలో ఉన్న ఓ హోటల్.. ఆ వరదలో కొట్టుకుపోయింది. మండి, కుల్లు ప్రాంతాల్లో డేంజర్ మార్క్ దాటి నది ప్రవాహిస్తున్నది. లోతట్టు ప్రాంతాల్లో జీవిస్తున్న వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నది. బహంగ్, అలూ గ్రౌండ్ ప్రాంతాల నుంచి జనాలను తరలిస్తున్నారు. మరో 24 గంటల పాటు నది సమీపానికి వెళ్లవద్దు అని టూరిస్టులకు అధికారులు వార్నింగ్ ఇచ్చారు.
Manali-Leh Road near Baahang, Manali😥😥 pic.twitter.com/EC7ZWKJx9r
— Queen of Himachal (@himachal_queen) August 26, 2025