Fire at motorbike showroom | మహారాష్ట్ర (Maharashtra) పూణె (Pune)లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సోమవారం రాత్రి ద్విచక్ర వాహనాల షోరూమ్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి (Fire at motorbike showroom). ఈ మంటల్లో పదుల సంఖ్యలో బైక్‌లు కాలి బూడిదయ్యాయి.
నగరంలోని తారాబాగ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బండ్ గార్డెన్ రోడ్డులోని మూడంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో టీవీఎస్ షోరూమ్, సర్వీస్ సెంటర్ ఉంది. సోమవారం రాత్రి 8:30 గంటల సమయంలో గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు చెలరేగినట్లు అధికారులు మంగళవారం తెలిపారు. కాసేపటికే మంటలు భవనం మొత్తం వ్యాపించినట్లు చెప్పారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నించారు. ఈ ప్రమాదంలో షోరూమ్‌లోని దాదాపు 60 ద్విచక్ర వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి.
ప్రమాదం నుంచి ఒకరిని సురక్షితంగా రక్షించారు. కాలిపోయిన వాహనాల్లో కొన్ని పెట్రోల్ వాహనాలు కాగా, మరికొన్ని ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. కొన్ని కొత్త వాహనాలు కాగా, మరికొన్ని రిపెయిర్స్ కోసం ఉంచిన వాహనాలు అని అధికారులు తెలిపారు. వాహనాలతోపాటూ కొన్ని స్పేర్ పార్ట్స్, కంప్యూటర్స్, ఫర్నిచర్, ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు, విలువైన పత్రాలు కాలి బూడిదైనట్లు పేర్కొన్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.
#WATCH | Pune, Maharashtra | Several bikes were turned into ashes after a fire broke out in a motorbike showroom last night. The fire was later doused
(Visuals Source: Fire Department) pic.twitter.com/jTLGk1JU8k
— ANI (@ANI) August 26, 2025
Also Read..
Himachal Pradesh | హిమాచల్‌పై మరోసారి ప్రకృతి ప్రకోపం.. భారీ వర్షానికి కుప్పకూలిన భవంతులు.. VIDEO
Landslide | అరుణాచల్ ప్రదేశ్‌లో కొండచరియల బీభత్సం.. వాహనాలపై పడిన బండరాళ్లు.. వీడియో
Apple | దూకుడుమీదున్న యాపిల్.. భారత్‌లో నాలుగో రిటైల్ స్టోర్ ప్రకటించిన టెక్ దిగ్గజం