Bomb Threat | దేశంలో వరుస బాంబు బెదిరింపులు (Bomb Threat) ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ముంబై ఎయిర్‌పోర్ట్‌కు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. శనివారం ఉదయం ముంబై పోలీసులకు ఫోన్ చేసిన ఆగంతకులు ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో (Chhatrapati Shivaji Maharaj Terminus) పేలుడు సంభవిస్తుందంటూ బెదిరింపులకు పాల్పడ్డారు.
విమానాశ్రయం టెర్మినల్ 2 వద్ద బాంబు అమర్చామని, త్వరలో పేలుతుందంటూ ముంబై పోలీసు కంట్రోల్ రూమ్‌కు మూడు వేర్వేరు నంబర్ల నుంచి ఫోన్‌కాల్స్ వచ్చాయి. బెదిరింపు ఫోన్‌కాల్స్‌తో అప్రమత్తమైన పోలీసులు భద్రతా చర్యలు ముమ్మరం చేశారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో ఎయిర్పోర్ట్ వద్దకు చేరుకొని తనిఖీలు చేపట్టారు. అయితే, గంటల తరబడి తనిఖీలు చేసినా ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ లభించలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అస్సాం-పశ్చిమ బెంగాల్ సరిహద్దు సమీపంలో యాక్టివ్‌గా ఉన్న మొబైల్ నంబర్ల నుంచి ఈ కాల్స్ వచ్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీంతో కాల్ చేసిన వారిని గుర్తించేందుకు, బెదిరింపుల వెనుక ఉన్న ఉద్దేశాన్ని తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Also Read..
PM Modi | ప్రధాని మోదీకి అరుదైన గౌరవం.. అత్యంత విశ్వసనీయ నేతగా గుర్తింపు
IRCTC | రైళ్లలో ఆహార నాణ్యతపై 2024-25లో 6,645 ఫిర్యాదులు.. వెల్లడించిన రైల్వే శాఖ మంత్రి
Kargil Vijay Diwas | పాక్ సైనికులపై ఫిరంగుల వర్షం.. కార్గిల్ యుద్ధంలో భారత్ విజయం