PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)కి అరుదైన గుర్తింపు లభించింది. ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయ నేత (Most Trusted Leader)గా నిలిచారు. ఈ విషయాన్ని బీజేపీ నేత అమిత్ మాలవీయ ఎక్స్ వేదికగా వెల్లడించారు.
మార్నింగ్ కన్సల్ట్ (Morning Consult) సంస్థ గ్లోబల్ లీడర్ (Global Leader) సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో భారతీయులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మంది విశ్వసించే నేతగా ప్రధాని మోదీ మొదటిస్థానంలో నిలిచారు. దాదాపు 75 శాతం మంది మద్దతుతో అత్యంత విశ్వసనీయత కలిగిన నాయకుడిగా మోదీ ప్రపంచ జాబితాలో అగ్రస్థానంలో (Global Approval Ratings) నిలిచారు. ఇక ఈ జాబితాలో దక్షిణ కొరియాకు చెందిన లీ జే-మ్యుంగ్ 59 శాతం మంది మద్దతుతో రెండో స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలే (57 శాతం), కెనడా ప్రధాని మార్క్ కార్నీ (56 శాతం) తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 44 శాతంతో ఎనిమిదో స్థానంలో ఉన్నారు.
Also Read..
IRCTC | రైళ్లలో ఆహార నాణ్యతపై 2024-25లో 6,645 ఫిర్యాదులు.. వెల్లడించిన రైల్వే శాఖ మంత్రి
Donald Trump | హమాస్ కథ ముగించాల్సిందే.. ఇజ్రాయెల్‌కు ట్రంప్ కీలక సూచన
Indian Embassy | థాయ్-కంబోడియా సరిహద్దుల్లో ఘర్షణలు తీవ్రతరం.. ఇండియన్ ఎంబసీ కీలక అడ్వైజరీ