Bomb Threat | ముంబై నుంచి థాయ్‌లాండ్ వెళ్తున్న ఇండిగో (IndiGo) విమానానికి బాంబు బెదిరింపులు (Bomb Threat) కలకలం రేపాయి. ఈ బెదిరింపులతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని చెన్నై (Chennai)కి దారి మళ్లించారు.
ఇండిగోకు చెందిన 6E 1089 విమానం శుక్రవారం రాత్రి ముంబై నుంచి థాయ్‌లాండ్‌లోని పుకెట్ (Phuket) దీవులకు బయల్దేరింది. విమానం గాల్లో ఉండగా.. బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పైలట్ సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. అనంతరం ముందు జాగ్రత్త చర్యగా విమానాన్ని చెన్నైకి దారి మళ్లించారు. అక్కడ ఫ్లైట్ సేఫ్‌గా ల్యాండ్ అయినట్లు అధికారులు తెలిపారు. తనిఖీల అనంతరం విమానం తిరిగి తన ప్రయాణాన్ని కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనతో అందులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
Also Read..
Bomb Threat | ఢిల్లీలోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. అప్రమత్తమైన పోలీసులు
Kamal Haasan | మావాళ్లు ఈసారి అసెంబ్లీలో అడుగుపెడతారు..: కమల్ హాసన్
Donald Trump | మాకు గొప్ప కార్మికులు అవసరం.. హెచ్-1బీ వీసా వార్షిక రుసుంపై ట్రంప్