శనివారం 23 జనవరి 2021
National - Jan 04, 2021 , 10:46:08

మార్చి తర్వాత అతితక్కువ కరోనా మరణాలు

 మార్చి తర్వాత అతితక్కువ కరోనా మరణాలు

ముంబై: దేశంలో కరోనా కేసులకు మహారాష్ట్ర కేంద్రంగా మారింది. అత్యధిక పాజిటివ్‌ కేసులు, మరణాలు రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని కేసుల్లో ముంబైదే అగ్రస్థానం. అలాంటిది ముంబైలో నిన్న మూడంటే మూడు మరణాలుమాత్రమే నమోదయ్యాయి. గతేడాది మార్చి తర్వాత ఇవే అతితక్కువ మరణాలు కావడం విశేషం. ముంబైలో 581 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా, ముగ్గురు మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,95,241కి చేరగా, ఇప్పటివరకు 11,135 మంది మృతిచెందారు.        

ఈ నేపథ్యంలో బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌ కమిషనర్‌ ఐఎస్‌ చాహల్‌ మహానగర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కరోనా మహమ్మారిని కట్టడిచేయడానికి వారు అందించిన సహకారం మరువలేనిదని చెప్పారు. వైరస్‌పై ముందుండి పోరాడిన డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలకు సెల్యూట్‌ చేస్తున్నానని చెప్పారు.


logo