నేటి నుంచి తెలంగాణలో యథావిధిగా బ్యాంకుల పని వేళలు
నేటి నుంచి తెలంగాణలో యథావిధిగా బ్యాంకు పని వేళలు | తెలంగాణలో గురువారం నుంచి బ్యాంకు పని వేళలు యథావిధిగా కొనసాగుతాయని ఎస్ఎల్బీసీ తెలిపింది. రాష్ట్రంలో లాక్డౌన్ నిబంధనలను సడలించడంతో గతంలో మాదిరిగానే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు కొనసాగుతాయని పేర్కొంది.

హైదరాబాద్ : తెలంగాణలో గురువారం నుంచి బ్యాంకు పని వేళలు యథావిధిగా కొనసాగుతాయని ఎస్ఎల్బీసీ తెలిపింది. రాష్ట్రంలో లాక్డౌన్ నిబంధనలను సడలించడంతో గతంలో మాదిరిగానే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు కొనసాగుతాయని పేర్కొంది. ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం లాక్‌డౌన్‌ను ఈ నెల 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు పొడగించడంతో పాటు సడలింపు సమయం ఉదయం 6 గంటల నుంచి 5 గంటల వరకు పెంచిన విషయం తెలిసిందే.
మేలో లాక్డౌన్ అమలు చేసిన నాటి నుంచి బ్యాంకు పని వేళలు మారాయి. లాక్డౌన్ ప్రారంభంలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం వరకు, జూన్ ఒకటో తోదీ నుంచి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బ్యాంకులు సేవలందించాయి. ఈ నెల 10 నుంచి లాక్డౌన్ నుంచి సడలింపులు ఇవ్వడంతో సాధారణ సమయాల్లోనే బ్యాంకింగ్ కార్యకలాపాలు కొనసాగుతాయని పేర్కొంది. బ్యాకింగ్ సమయ వేళలను ఖాతాదారులు గమనించాలని ఎస్ఎల్బీసీ సూచించింది.
ఇవి కూడా చదవండి..
8 మందికి కొత్త జీవితాన్నిచ్చిన బ్రెయిన్ డెడ్ వ్యక్తి
బెంగళూరు ఐఐఎస్సీ టాప్
విషాదం.. ముంబైలో భవనం కూలి తొమ్మిది మంది దుర్మరణం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

