దేశంలో కరోనా మరణ మృదంగం.. 24 గంటల్లో 6,148 మంది మృతి
దేశంలో కరోనా మరణ మృదంగం | దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పడుతున్న.. మరణాలు మాత్రం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.

న్యూఢిల్లీ : దేశంలో కరోనా మరణ మృదంగం మోగిస్తున్నది. రోజువారి కేసులు తగ్గుముఖం పడుతున్న.. మరణాలు మాత్రం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా వరుసగా మూడు రోజు కొవిడ్ కేసులు లక్షకు దిగువన నమోదవగా.. రికార్డు స్థాయిలో ఒకే రోజు 6,148 మరణాలు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి నుంచి ఇంత పెద్ద మొత్తంలో మరణాలు నమోదవడం ఇదే తొలిసారి. గడిచిన 24 గంటల్లో 94,052 కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్తగా 1,51,367 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారని పేర్కొంది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,91,83,121కు చేరింది. ఇందులో 2,76,55,493 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్ బారినపడి ఇప్పటి వరకు 3,59,676 మంది ప్రాణాలు వదిలారు. ప్రస్తుతం దేశంలో 11,67,952 యాక్టివ్ కేసులున్నాయని చెప్పింది. టీకా డ్రైవ్‌లో ఇప్పటి వరకు 23,90,58,360 డోసులు పంపిణీ చేసినట్లు వివరించింది. అయితే, బిహార్ మరణాల డేటాను సవరించిన నేపథ్యంలో మృతుల సంఖ్య ఈ స్థాయిలో పెరిగినట్టు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి..
8 మందికి కొత్త జీవితాన్నిచ్చిన బ్రెయిన్ డెడ్ వ్యక్తి
బెంగళూరు ఐఐఎస్సీ టాప్
విషాదం.. ముంబైలో భవనం కూలి తొమ్మిది మంది దుర్మరణం
నేటి నుంచి తెలంగాణలో యథావిధిగా బ్యాంకుల పని వేళలు
ఘంటసాల రెండో కుమారుడు రత్నకుమార్ కన్నుమూత
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

