వేలంలో రూ.138 కోట్ల ధర పలికిన బంగారు నాణెం
వేలంలో రూ.138 కోట్ల ధర పలికిన బంగారు నాణెం | అమెరికాలో 20 డాలర్ల విలువైన బంగారు నాణెం రికార్డు స్థాయిలో రూ.138 కోట్ల ధర పలికింది. అలాగే బంగారు నాణెంతో పాటు అరుదైన స్టాంప్ సైతం భారీ ధరకు అమ్ముడైంది.

వాషింగ్టన్ : అమెరికాలో 20 డాలర్ల విలువైన అరుదైన బంగారు నాణెం రికార్డు స్థాయిలో రూ.138 కోట్ల ధర పలికింది. అలాగే బంగారు నాణెంతో పాటు అరుదైన స్టాంప్ సైతం భారీ ధరకు అమ్ముడైంది. 1933 నాటి డబుల్ ఈగిల్ బంగారు నాణెంను మంగళవారం న్యూయార్క్‌లో వేలం వేయగా.. గతంలో ఉన్న రికార్డులను బద్దలు కొట్టి అత్యధిక ధరకు అమ్ముడైంది. సోథెబై వేలంలో ఈ నాణెం రూ.73 కోట్ల నుంచి రూ.100 కోట్ల మధ్య అమ్ముడవుతుందని భావించినప్పటికీ ఈ నాణెం ధర కొత్త రికార్డు సృష్టించింది. 1933 నాటి డబుల్ ఈగిల్ బంగారు నాణెన్ని 18.9 మిలియన్ డాలర్లకు ఓ వ్యక్తి దక్కించుకున్నారు. ఇది భారత కరెన్సీలో దాదాపు రూ.138 కోట్లు. ఇదే వేలంలో ప్రపంచంలోనే అరుదైన ఓ స్టాంప్ కూడా 8.3 మిలియన్ డాలర్లకు అమ్మువైంది.
ఈ గోల్డ్ కాయిన్‌ను ఫ్యాషన్ డిజైనర్ స్టువార్ట్ వీట్జమన్‌కు చెందిన ఈ నెల 8న వేలం వేశారు. 20 డాలర్ల ఈ బంగారు నాణెలను 1933లో తయారుచేసినా.. తీవ్ర ఆర్థిక మంద్యాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పటి అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్ట్ డబుల్ ఈగల్ నాణెలను చలామణికి విడుదల చేయకుండా ఆపేశారు. నాణెలను కరిగించమని ఆదేశించారు. అప్పుడు బయటికి వచ్చిన రెండింటిలో ఇదొకటి. డబుల్ ఈగిల్‌పై ఒకవైపు లేడీ లిబర్టీ, రెండో వైపు అమెరికన్ ఈగిల్ బొమ్మలు ముద్రించి ఉన్నాయి. 1794కు చెందిన ‘ఫ్లోయింగ్ హెయిర్’ అనే వెండి నాణెం 2013లో రూ.73 కోట్లకు అమ్ముడుపోయి అత్యధిక ధర పలికిన నాణెంగా రికార్డులకెక్కింది.
జూన్ 8న డబుల్ ఈగిల్ నాణెం రూ.138 కోట్లు పలికి ఆ రికార్డును తిరగరాసింది. అలాగే 1856లో జారీ చేసిన బ్రిటిష్ గయానా ఒకటో సెంట్ మెజెంటా స్టాంప్‌ను 8.3 మిలియన్ డాలర్లకు అమ్ముడైంది. ఇది చరిత్రలో అత్యంత విలువైన స్టాంప్‌గా నిలిచింది. దక్షిణ అమెరికా దేశం ముద్రించిన ఏకైక స్టాంప్ ఇది. ఈ స్టాంప్‌ను ఫ్యాషన్ డిజైనర్ 2014లో కొనుగోలు చేశారు. చిన్నతనం నుంచి స్టాంపులు, నాణెలను వీట్జమన్ సేకరిస్తున్నారు. ఈ వేలం ద్వారా వచ్చిన డబ్బును తన డిజైన్ స్కూల్‌తో పాటు వైద్య పరిశోధన, మాడ్రిడ్‌లోని మ్యూజియం, పలు స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
8 మందికి కొత్త జీవితాన్నిచ్చిన బ్రెయిన్ డెడ్ వ్యక్తి
బెంగళూరు ఐఐఎస్సీ టాప్
విషాదం.. ముంబైలో భవనం కూలి తొమ్మిది మంది దుర్మరణం
నేటి నుంచి తెలంగాణలో యథావిధిగా బ్యాంకుల పని వేళలు
ఘంటసాల రెండో కుమారుడు రత్నకుమార్ కన్నుమూత
దేశంలో కరోనా మరణ మృదంగం.. 24 గంటల్లో 6,148 మంది మృతి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

