Heart Attack | మహారాష్ట్ర రాజధాని ముంబై (Mumbai)లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. క్రికెట్ ఆడుతూ (cricket match) ఓ వ్యక్తి గుండెపోటుకు (Heart Attack) గురై ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన కశ్మీరా ప్రాంతంలో ఆదివారం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. కశ్మీరా ప్రాంతం (Kashmira area)లోని ఓ ఫామ్‌హౌస్‌లో ఓ కంపెనీ తమ ఉద్యోగులకు క్రికెట్ మ్యాచ్‌ను నిర్వహించింది. అందులో పాల్గొన్న 42 ఏళ్ల రామ్ గణేష్ తేవార్ మైదానంలో బ్యాటింగ్ చేశాడు. బౌలర్ వేసిన బంతికి సిక్స్ కొట్టాడు. అనంతరం అందరూ చూస్తుండగానే ఉన్నచోటే ఒక్కసారిగా కుప్పకూలి కిందపడిపోయాడు. తోటి ఉద్యోగులు వెంటనే అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆ వ్యక్తి చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు ఆకస్మిక మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రామ్ గణేష్ బ్యాటింగ్ చేస్తూ మైదానంలో కుప్పకూలిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
मुंबई के मीरा रोड में क्रिकेट खेलते समय युवक की मौत pic.twitter.com/YDkZDSp5oM
— Shubham Rai (@shubhamrai80) June 3, 2024
Also Read..
Bengaluru | బెంగళూరులో కుంభవృష్టి.. 133 ఏళ్ల రికార్డు బద్దలు
Sonia Gandhi | జూన్ 4న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారే : సోనియా గాంధీ
Mother Dairy | అమూల్ బాటలోనే మదర్ డెయిరీ.. లీటరు పాలపై రూ.2 పెంపు