Mother Dairy | ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ మదర్ డెయిరీ (Mother Dairy) మళ్లీ పాల ధరలు పెంచేసింది (increased prices). అన్ని రకాల ఉత్పత్తులపై రూ.2 మేర ధరలు పెంచినట్లు మదర్ డెయిరీ సోమవారం తెలిపింది. గత 15 నెలలుగా ఇన్పుట్ కాస్ట్ పెరగడంతో పాల ధరలు పెంచక తప్పలేదని పేర్కొంది. పెరిగిన ధరలు దేశవ్యాప్తంగా సోమవారం నుంచే (జూన్ 3) అమల్లోకి వస్తాయని తెలిపింది.
తాజా పెంపుతో టోకెన్ మిల్క్ (బల్క్ వెండెడ్ మిల్క్) లీటర్ ధర రూ.2 పెరిగి రూ.52 నుంచి రూ.54కు చేరింది. అదే సమయంలో టోన్డ్ మిల్క్ లీటర్ ధర రూ.54 నుంచి రూ.56కు, ఆవు పాల ధర రూ.56 నుంచి రూ.58కి, ఫుల్ క్రీమ్ మిల్క్ ధర రూ.66 నుంచి రూ.68కి, గేదె పాలు లీటరు ధర రూ.70 నుంచి రూ.72కు డబుల్ టోన్డ్ మిల్క్ ధర రూ.48 నుంచి రూ.50కి పెరిగింది.
మరోవైపు గుజరాత్‌కు చెందిన పాల కంపెనీ అమూల్ (Amul Milk) పాల ధరలను పెంచేసిన విషయం తెలిసిందే. అన్ని రకాల ఉత్పత్తులపై రూ.2 మేర ధరలు పెంచినట్లు ‘అమూల్’ బ్రాండ్‌తో డెయిరీ ఉత్పత్తులను విక్రయిస్తున్న గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (GCMMF) ఆదివారం ప్రకటించింది. అమూల్ బాటలోనే మదర్ డెయిరీ కూడా పాల ఉత్పత్తులను తాజాగా పెంచింది. దేశంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందన్న వార్తల నేపథ్యంలో రెండు సంస్థలు పాల ధరలను పెంచడం గమనార్హం.
Mother Dairy has increased prices of fresh pouch milk (All variants) by Rs 2 per litre, effective from June 3: Mother Dairy pic.twitter.com/zUnftxsG7d
— ANI (@ANI) June 3, 2024
Also Read..
Amul Milk | మరోసారి పెరిగిన అమూల్ పాల ధరలు.. లీటరుపై రూ.2 భారం
MLC Kavitha | కవిత జ్యుడీషియల్ కస్టడీ జులై 3 వరకూ పొడిగింపు
Akasa Air | ఢిల్లీ – ముంబై విమానానికి సెక్యూరిటీ అలర్ట్.. అహ్మదాబాద్‌కు మళ్లింపు