Donald Trump | ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ (Emmanuel Macron)ను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన వ్యాఖ్యలు చేశారు. సుంకాల (Tariffs) విషయంలో మేక్రాన్ ‘ప్లీజ్ డొనాల్డ్’ అంటూ తన వద్ద ప్రాధేయపడినట్లు గుర్తు చేశారు. రిపబ్లికన్ చట్టసభ సభ్యులను ఉద్దేశించి ట్రంప్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా గతంలో మేక్రాన్‌తో జరిగిన సంభాషణ గురించి ప్రస్తావించారు.
ఫ్రాన్స్ ఔషధాల ధరలు తక్కువగా ఉండటంతో అమెరికాలో ఇవి ఎక్కువగా సేల్ అయ్యేవి. ఫలితంగా అమెరికా ఔషధ కంపెనీలకు తీవ్ర నష్టం వాటిల్లేది. దీన్ని పరిష్కరించేందుకు ఔషధ ధరలను మూడింతలు పెంచాలని మేక్రాన్‌కు ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. అందుకు ఒప్పుకోకపోతే.. ఫ్రాన్స్ నుంచి దిగుమతి అవుతోన్న వస్తువులపై (French products) 25 శాతం టారిఫ్‌లు విధిస్తానని అధ్యక్షుడు హెచ్చరించారు. దీంతో ట్రంప్ డిమాండ్లకు మేక్రాన్ తలొగ్గాల్సి వచ్చింది. ‘ప్లీజ్ డొనాల్డ్ మన మధ్య ఒప్పందం ఉంది. ఔషధాల ధరలను మీకు కావల్సినంత పెంచుతాను. ఈ విషయం మా ప్రజలకు చెప్పకండి’ అంటూ మేక్రాన్ తనతో ప్రాధేయపడినట్లు ట్రంప్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ మేరకు మేక్రాన్‌ను ఎగతాళి చేస్తూ మాట్లాడారు. 10 డాలర్లు ఉన్న ఒక మందుబిళ్ల ధరను ఫ్రాన్స్ 30 డాలర్లకు పెంచిందని ట్రంప్ వివరించారు.
Also Read..
Donald Trump | అది జరగాలంటే చైనా, రష్యాతో సంబంధాలు తెంచుకోవాలి.. వెనెజువెలాకు ట్రంప్ టీమ్ షరతులు
Ice tsunami | మంచు సునామీ.. షాకింగ్ వీడియో
Donald Trump: 50 మిలియన్ బ్యారెళ్ల ఇంధనం అమ్మనున్న వెనిజులా: డోనాల్డ్ ట్రంప్