MLC Kavitha | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో (Delhi liquor policy case) ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) జ్యుడీషియల్ కస్టడీ (judicial custody)ని కోర్టు మరోసారి పొడిగించింది. ఈ సారి ఏకంగా నెలపాటూ కస్టడీ పొడిగిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
ప్రస్తుతం ఈ కేసులో రిమాండ్‌లో ఉన్న కవితను.. జ్యూడీషియల్ కస్టడీ ముగియడంతో అధికారులు సోమవారం కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ కేసులో కవితకు జులై 3 వరకూ జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. మరోవైపు సీబీఐ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపుపై మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరగనుంది. దీని కోసం ఆమెను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపర్చనున్నారు.
#WATCH | Delhi: BRS leader K Kavtiha being brought out of Rouse Avenue Court. The Court extended her judicial custody till July 3. pic.twitter.com/tquh0TIszf
— ANI (@ANI) June 3, 2024
Also Read..
Akasa Air | ఢిల్లీ – ముంబై విమానానికి సెక్యూరిటీ అలర్ట్.. అహ్మదాబాద్‌కు మళ్లింపు
Stock Market | ఎగ్జిట్ పోల్స్ జోష్.. భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
Vettaiyan Movie | ఎన్టీఆర్ ‘దేవర’కు పోటిగా వస్తున్న రజినీకాంత్ ‘వెట్టయాన్’.?