Vettaiyan Movie | ఎన్టీఆర్ ‘దేవర’కు పోటిగా వస్తున్న రజినీకాంత్ ‘వెట్టయాన్’.?
Vettaiyan Movie | ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘వెట్టయాన్’(Vettayan). తెలుగులో వేటగాడు (Vetagadu) అని వస్తున్న ఈ సినిమాకు జై భీమ్ ఫేమ్ టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నాడు.
Vettaiyan Movie | ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘వెట్టయాన్’(Vettayan). తెలుగులో వేటగాడు (Vetagadu) అని వస్తున్న ఈ సినిమాకు జై భీమ్ ఫేమ్ టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ అగ్రనటుడు అమితాబ్ బచ్చన్, మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్, దుషారా విజయన్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ రిలీజ్ అప్డేట్ ఇచ్చారు.
ఈ మూవీని మొదట 2024 దసరా కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే తేదీని మాత్రం అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు తాజాగా తేదీని కూడా ఖరారు చేసినట్లు తెలుస్తుంది.. ఈ సినిమాను అక్టోబర్ 10న విడుదల చేయనున్నట్లు సమాచారం. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే ఇదే రోజున టాలీవుడ్ నుంచి మరో పెద్ద సినిమా రాబోతుంది. టాలీవుడ్ నటుడు ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో దేవర అనే మూవీ వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కూడా అక్టోబర్ 10న విడుదల కానుంది. దీంతో దసరా రోజు బిగ్ ఫైట్ జరుగనున్నట్లు తెలుస్తుంది.
Confirmed – #Vettaiyan – 10th Oct Release pic.twitter.com/PUY6AIMP4Q
— Aakashavaani (@TheAakashavaani) June 3, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

