Stock Market | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ దేశంలో మూడోసారి అధికారంలోకి వస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల (Exit Polls Predict) నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Market) భారీ లాభాలతో (Massive Jump) ప్రారంభమయ్యాయి. మోదీ వేవ్ తో సూచీలు సరికొత్త చరిత్ర సృష్టించాయి. రికార్డు స్థాయిలో పరుగులు పెడుతున్నాయి. సోమవారం ఉదయం సెన్సెక్స్ ఏకంగా 2,000 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్ మొదలుపెట్టగా.. నిఫ్టీ ఆరంభంలోనే 600 పాయింట్లకు పైగా పుంజుకుంది.
ప్రస్తుతం సెన్సెక్స్ 2,082 పాయింట్లు పెరిగి రూ. 76,043 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక నిఫ్టీ 650 పాయింట్లు లాభపడి 23,175 వద్ద కొనసాగుతోంది. అంతకుముందు సెన్సెక్స్ 76,738.89 దగ్గర, నిఫ్టీ 23,338.70 వద్ద రికార్డు గరిష్టాన్ని నమోదు చేశాయి. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83 వద్ద ప్రారంభమైంది. ప్రభుత్వరంగ సంస్థలు, బ్యాంకింగ్ షేర్లు భారీ లాభాల్లో ఉన్నాయి. పవర్ గ్రిడ్, అదానీ పోర్ట్స్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎల్ అండ్ టీ, ఎన్టీపీసీ, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, ఎం అండ్ ఎం, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రియలన్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఈ స్టాక్స్ 3 నుండి 7 శాతం లాభాలబాటలో ఉన్నాయి.
Also Read..
Hyderabad student missing | అమెరికాలో హైదరాబాద్ యువతి అదృశ్యం
Pakistan Army | పాకిస్థాన్ బ్రిగేడియర్‌గా.. తొలిసారి క్రైస్తవ మైనారిటీ మహిళ
Amul Milk | మరోసారి పెరిగిన అమూల్ పాల ధరలు.. లీటరుపై రూ.2 భారం