రామగిరి, డిసెంబర్ 31 : ఎస్టీయూ టీఎస్ నల్లగొండ జిల్లా నూతన కార్యవర్గాన్ని బుధవారం ఎన్నుకున్నారు. నల్లగొండలోని ఆ సంఘం జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో నూతన అధ్యక్ష, కార్యదర్శిగా డా.తండు భానుప్రకాష్ గౌడ్, మురారిశెట్టి రమేశ్‌ను ఏకగ్రీవంగా ఎనుకున్నారు. ఎన్నికకు రాష్ట్ర కార్యదర్శి వై.కరుణాకర్‌రెడ్డి, యాద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రమేశ్, నల్లగొండ జిల్లా మాజీ అధ్యక్షుడు కొనకంచి వీరరాఘవులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న డీఏలను ప్రభుత్వం తక్షణమే అందచేయాలని, ఉద్యోగుల పదవీ విరమణ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే టెట్ నుండి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులను మినహాయించాలని, టెట్ పరీక్షకు హాజరవుతున్న ఉపాధ్యాయులకు ఓడీ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.నరేందర్‌రెడ్డి, జిల్లా మండల బాధ్యులు, జిల్లా కౌన్సిల్ సభ్యులు కె.దత్తేశ్వర్, ఉదయరాణి, ప్రమీల, నాగేశ్వర్రావు, వెంకటేశ్వర్లు, అశోక్ రెడ్డి, సైదానాయక్, విజయప్రసాద్, జాన్ ఖాన్, తావుర్యనాయక్ ,రామ్ సింగ్ ,వీరనారాయణ పాల్గొన్నారు.

Ramagiri : ఎస్టీయూ టీఎస్ నల్లగొండ నూతన కార్యవర్గం