రాజాపేట, డిసెంబర్ 31 : రాజాపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన సోషల్ టీచర్ పుల్ల శిరోమణి క్రిస్టోఫర్ పదవీ విరమణ పొందారు. బుధవారం విధుల్లో చివరి రోజు పాఠశాల నుండి సాయంత్రం బయటికి వెళ్తున్న క్రమంలో తమకు విద్యాబుద్ధులు నేర్పిన టీచర్ వెళ్లిపోతున్నందున విద్యార్థులు భావోద్వానికి లోనయ్యారు. టీచర్, టీచర్ మీరు వెళ్లొద్దు అంటూ విద్యార్థులు ఉపాధ్యాయురాలుని పట్టుకుని ఏడ్చేశారు. విద్యార్థులు ఏడుస్తున్న తీరును చూసి టీచర్ సైతం వారిని గట్టిగా కౌగిలించుకుని కంటతడి పెట్టారు.