Sonia Gandhi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ (BJP-led NDA) దేశంలో మూడోసారి అధికారంలోకి వస్తుందని అత్యధికంగా ఎగ్జిట్ పోల్స్ (Exit Polls) అంచనా వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ (Sonia Gandhi) తాజాగా స్పందించారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎన్నికల ఫలితాలకు పూర్తి విరుద్ధంగా (completely opposite) ఉంటాయని అన్నారు.
తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి 100వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని డీఎంకే కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సోనియా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరుణానిధికి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ఫలితాలపై ప్రతిపక్ష ఇండియా కూటమి ఆశాభావంతో ఉందన్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు ఎన్నికల ఫలితాలు పూర్తి విరుద్ధంగా ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు. జూన్ 4న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారవుతాయని భావిస్తున్నట్లు చెప్పారు. ఆరోజు వరకూ అంతా వేచి చూద్దాం అని పేర్కొన్నారు.
Also Read..
Sri Lanka | భారీ వర్షాలకు అతలాకుతలమవుతున్న ద్వీపదేశం.. 15 మంది మృతి
Mother Dairy | అమూల్ బాటలోనే మదర్ డెయిరీ.. లీటరు పాలపై రూ.2 పెంపు
Akasa Air | ఢిల్లీ – ముంబై విమానానికి సెక్యూరిటీ అలర్ట్.. అహ్మదాబాద్‌కు మళ్లింపు