Sri Lanka | రుతుపవనాల ప్రభావంతో ద్వీపదేశం శ్రీలంక (Sri Lanka)ను భారీ వర్షాలు (heavy rain) అతలాకుతలం చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీ వర్షాలకు వరదలు సంభవించాయి. ఈ వర్షాలకు సుమారు 10 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.
శ్రీలంకలో సుమారు 300 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. బలమైన గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. దీంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ వర్షాల కారణంగా సుమారు 15 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. రాజధాని కొలంబో సహా మొత్తం ఏడు జిల్లాల్లో ఈ మరణాలు నమోదైనట్లు చెప్పారు.
ఈ వర్షాలకు 4 వేలకుపైగా ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. 28 ఇళ్లు పూర్తిగా ధ్వంసమైనట్లు చెప్పారు. వరదలకు 5 వేల కుటుంబాలకు చెందిన 19 వేల మంది నిరాశ్రయులైనట్లు పేర్కొన్నారు. రంగంలోని దిగిన శ్రీలంక సైన్యం వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ అత్యవసర ప్రతిస్పందన కోసం వైమానిక దళం మూడు హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచిందని వివరించారు. మరోవైపు భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యగా ద్వీపం అంతటా పాఠశాలలను మూసివేస్తున్నట్లు (schools shut) ప్రకటించింది. అదేవిధంగా పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరానూ నిలిపివేసింది.
Also Read..
Mother Dairy | అమూల్ బాటలోనే మదర్ డెయిరీ.. లీటరు పాలపై రూ.2 పెంపు
Heeramandi | ‘హీరామండి’ సెకండ్ సీజన్ వచ్చేస్తుంది.. అనౌన్స్మెంట్ వీడియో
Earthquake | జపాన్లో 5.9 తీవ్రతతో భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు