Earthquake | జపాన్లో 5.9 తీవ్రతతో భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు
జపాన్లోని ఇషికావా ప్రిఫెక్చర్లో నిమిషాల వ్యవధిలో రెండుసార్లు భూమి కంపించింది (Earthquake). సోమవారం తెల్లవారుజామున 6.31 గంటలకు 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. అదే ప్రాంతంలో మరో 10 నిమిషాల తర్వాత 4.8 తీవ్రతతో భూమి కంపించింది.
టోక్యో: జపాన్లోని ఇషికావా ప్రిఫెక్చర్లో నిమిషాల వ్యవధిలో రెండుసార్లు భూమి కంపించింది (Earthquake). సోమవారం తెల్లవారుజామున 6.31 గంటలకు 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. అదే ప్రాంతంలో మరో 10 నిమిషాల తర్వాత 4.8 తీవ్రతతో భూమి కంపించింది. దీంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
నోటో పీఠభూమిలో భూకంప కేంద్రం ఉన్నదని జపాన్ వాతావరణ శాఖ తెలిపింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని పేర్కొంది. నోటో నగరంలో ఐదు కంటే తక్కువ తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని తెలిపింది. ప్రస్తుతం ఎలాంటి సునామీ ముప్పు లేదని అధికారులు వెల్లడించారు. ఇదే ప్రాంతంలో జనవరి 1న సంభవించిన భూకంపంలో 230 మందికిపైగా మరణించిన విషయం తెలిసిందే.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

