Heeramandi Season 2 | బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన తాజా వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్(Heeramandi: The Diamond Bazaar). స్వాతంత్య్రానికి ముందు లాహోర్‌లోని హీరామండి (వేశ్యావాటిక)లో జరిగిన పలు సంఘటనల ప్రకారం పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో వచ్చిన ఈ వెబ్ సిరీస్‌లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరీ, రిచా చద్దా, షర్మిన్ సెగల్, సంజీదా షేక్‌లు ప్రధాన పాత్రలు పోషించారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో మే 01న స్ట్రీమింగ్కు వచ్చిన ఈ సిరీస్ మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సిరీస్ ముగింపులో సెకండ్ సీజన్ ఉండబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇక చెప్పినట్లుగానే తాజాగా సీజన్ అనౌన్స్‌మెంట్‌ను ప్రకటించింది. హీరామండి 2వ సీజన్‌ను త్వరలోనే ప్రకటించబోతున్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఇక సెకండ్ సీజన్లో వేశ్యలందరూ హీరామండి (లాహోర్) నుంచి ఇండియాకు రాబోతున్నట్లు తెలుస్తుంది. 1947 విభజన తర్వాత లాహోర్‌ను విడిచిపెట్టి కొంతమంది ముంబై చిత్ర పరిశ్రమలో మరికొంత కోల్‌కతా చిత్ర పరిశ్రమలో స్థిరపడనున్నట్లు సమాచారం.
ఈ సిరీస్ కథ విషయానికి వస్తే.. హీరామండీలో ఉన్న షాహీ మహల్‌కు మల్లికా జాన్ (మనీషా కొయిరాలా) పెద్ద దిక్కు. బిబోజాన్ (అదితిరావు హైదరీ), ఆలంజేబు (షర్మిన్ సెగల్) ఆమె కూతుళ్లు, వహీదా (సంజీదా షేక్) సోదరి. అదే ప్రాంతంలోని ఖ్వాభాగ్ మహల్‌కు పెద్ద ఫరీదాన్ (సోనాక్షి సిన్హా). కొన్ని సంఘటనల కారణంగా మల్లికా జాన్, ఫరీదాన్ మధ్య శత్రుత్వం ఏర్పడుతుంది. బ్రిటిష్‌వాళ్లతో సత్సంబంధాలు కలిగి ఉన్న వలీసాహెబ్ (ఫర్దీన్‌ఖాన్)తో పరిచయం పెంచుకుంటుంది బిబోజాన్. స్వాతంత్య్ర పోరాటంలో గూఢచారిగా పనిచేసే బిబోజాన్.. వలీసాహెబ్ దగ్గరనుంచి రహస్యాలను తెలుసుకుంటూ ఉంటుంది. ఆమె గూఢచారి అని తెలిసిన తర్వాత బ్రిటిష్‌వాళ్లు బిబోజాన్ను ఏం చేశారు? షాహీ మహల్ చేజిక్కించుకోవడానికి ఫరీదాన్ ఎలాంటి కుట్రలు చేసింది? వాటిని మల్లికా జాన్ ఎలా ఎదుర్కొన్నది? తదితర విషయాలు తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. ఎనిమిది ఎపిసోడ్లుగా వచ్చిన ఈ సిరీస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
Mehfil phir se jamegi, Heeramandi: Season 2 jo aa raha hai 🌹✨🎉#HeeramandiOnNetflix #Heeramandi #HeeramandiTheDiamondBazaar pic.twitter.com/ns02aVh6ly
— Netflix India (@NetflixIndia) June 3, 2024