Mihir Shah | మహారాష్ట్ర రాజధాని ముంబైలో శివసేన (Shiv Sena) నేత రాజేష్ షా (Rajesh Shah) కుమారుడు మిహిర్ మద్యం మత్తులో కారు నడిపి ఓ వివాహిత మరణానికి కారణమైన ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనకు కారణమైన ప్రధాన నిందితుడు మిహిర్ షా (Mihir Shah)కి కోర్టు 14 రోజుల పాటు జుడీషియల్ కస్టడీ (judicial custody) విధించింది. ఈ కేసులో అరెస్టైన మిహిర్ షా కస్టడీ నేటితో ముగియడంతో అతడిని శివాది కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో కోర్టు నిందితుడికి ఈనెల 30 వరకూ జుడీషియల్ కస్టడీ విధిస్తూ తీర్పు వెలువరించింది.
ఇటీవలే ముంబైలోని వర్లీ ప్రాంతంలో తెల్లవారుజామున మిహిర్ ( Mihir Shah) మద్యం మత్తులో బీఎండబ్ల్యూ కారును వేగంగా నడుపుతూ ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టాడు. దీంతో స్కూటీపై వెళ్తున్న దంపతులు ఎగిరి రోడ్డుపై పడ్డారు. అలాగే వేగంగా వెళ్తున్న కారు కావేరి నక్వా (45) పై నుంచి దూసుకెళ్లడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆమె భర్త మాత్రం గాయాలతో బయటపడ్డాడు. ప్రమాదం తర్వాత మిహిర్ ఫోన్లో తన తండ్రికి విషయం చెప్పడంతో ఆయన వెంటనే ఘటనా స్థలికి చేరుకొని కొడుకుని అక్కడ నుంచి పంపించి వేశాడు. ఇంతలో అక్కడకు చేరుకున్న పోలీసులు రాజేష్, డ్రైవర్ బిదావత్‌ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత రాజేష్ షా బెయిల్‌పై బయటకు వచ్చారు.
పోలీసుల కథనం ప్రకారం.. మిహిర్ తొలుత మహిళను ఢీకొన్న తర్వాత ఆమెను 1.5 కిలోమీటర్లు ఈడ్చుకు వెళ్లాడు. తర్వాత వాహనం టైరులో చిక్కుకున్న ఆమెను రోడ్డుపై పడేశాడు. తర్వాత బిదావత్ కారు నడిపాడు. కారును రివర్స్ చేసేటప్పుడు ఆమెపై నుంచి మరోసారి కారును ఎక్కించాడు. అయితే ఈ కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు మిహిర్ షాను పోలీసులు ఈ నెల 9న అదుపులోకి తీసుకున్నారు. ముంబైలోని విరారా ప్రాంతంలో మిహిర్‌ను అరెస్ట్ చేశారు.
#UPDATE | Worli (Mumbai) hit-and-run case | Accused Mihir Shah sent to Judicial custody for 14 days, till 30th July https://t.co/lI5oUJDmpS
— ANI (@ANI) July 16, 2024
Also Read..
All Party Meet | ఈనెల 21న అఖిలపక్ష సమావేశం.. హాజరుకావడం లేదన్న తృణమూల్ కాంగ్రెస్
India – Russia | ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించేలా పుతిన్‌తో మాట్లాడండి.. భారత్‌కు అమెరికా విజ్ఞప్తి
Donald Trump | రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్ పేరు ఖరారు.. ఉపాధ్యకుడిగా ఎవరంటే..?