All Party Meet | ఈనెల 21న అఖిలపక్ష సమావేశం.. హాజరుకావడం లేదన్న తృణమూల్ కాంగ్రెస్
All Party Meet | పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ( Parliament Session) ఈ నెల 22న ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం ఆల్ పార్టీ మీటింగ్ (All Party Meet)కు ఆహ్వానించింది.
All Party Meet | పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ( Parliament Session) ఈ నెల 22న ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఆగస్టు 12 వరకు జరిగే ఈ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 23న పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఆల్ పార్టీ మీటింగ్ (All Party Meet)కు ఆహ్వానించింది. జూలై 21న కేంద్రం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
పార్లమెంట్ ఉభయసభల్లోని అన్ని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లను బడ్జెట్ సెషన్, సభా వ్యవహారాలపై చర్చించేందుకు కేంద్రం సమావేశానికి ఆహ్వానించింది. సభ సజావుగా సాగడంతో పాటు ముఖ్యమైన అంశాలపై భేటీలో చర్చించే అవకాశం ఉన్నది. అయితే ఈ సమావేశానికి తృణమూల్ కాంగ్రెస్ (Trinamool Congress) హాజరు కావడం లేదు. జులై 21న రాష్ట్ర అమరవీరుల దినోత్సవం నేపథ్యంలో ఈ సమావేశానికి హాజరుకావడం లేదని టీఎంసీ వర్గాలు తెలిపాయి.
లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ ఏడాది ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఎన్నికల అనంతరం పూర్తిస్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వం అప్పట్లో తెలిపింది. ఈ నేపథ్యంలోనే కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో 2024-25 సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) సభలో ప్రవేశ పెట్టనున్నారు. ఇక ఈ సమావేశాలు జూలై 22న ప్రారంభమై ఆగస్టు 12న ముగుస్తాయి. జూలై 23న బడ్జెట్‌ను సమర్పించనున్నారు.
నిర్మలమ్మ సరికొత్త రికార్డు..
ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ సరికొత్త రికార్డ్ నెలకొల్పనున్నారు. వరుసగా రెండోసారి ఆర్థిక మంత్రిగా ఎన్నికైన ఆమె.. 2024-25 బడ్జెట్‌ను సమర్పించనున్నారు. అయితే, వరుసగా ఆరుసార్లు బడ్జెట్లను సమర్పించిన మాజీ ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్‌ని అధిగమించనున్నారు. మొరార్జీ దేశాయ్ వరుసగా ఆరుసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈసారి కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెడితే.. వరుసగా ఏడు కేంద్ర బడ్జెట్లను సమర్పించిన ఆర్థిక మంత్రిగా ఆమె సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయనున్నారు.
కాగా, మోదీ తొలి విడుత మంత్రి వర్గంలో (2014) పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ బాధ్యతలు చేపట్టారు. 2017లో కీలకమైన రక్షణ శాఖ బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత 2019లో రెండోసారి ప్రధాని మోదీ ఎన్నికైన తర్వాత ఏర్పాటైన కేంద్ర మంత్రి వర్గంలోనూ చోటు దక్కించుకున్న నిర్మలా సీతారామన్‌కు అత్యంత కీలకమైన ఆర్థికశాఖను అప్పగించారు నరేంద్రమోదీ. నాటి నుంచి దేశీయ ఆర్థిక రంగంలో మలి విడుత ఆర్థిక సంస్కరణలను పరుగులెత్తించారు. కేంద్ర మంత్రివర్గంలో మూడోసారి వరుసగా చోటు దక్కించుకున్న ఏకైక మహిళా నాయకురాలిగా నిర్మలా సీతారామన్ రికార్డు నెలకొల్పారు.
Also Read..
Rahul Gandhi | భద్రతా లోపాలకు ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత.. దోడా ఉగ్రదాడి ఘటనపై రాహుల్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Home Guard Killed | బహిరంగంగా మద్యం తాగడాన్ని అడ్డుకున్న హోమ్ గార్డు.. కొట్టి చంపిన ముగ్గురు వ్యక్తులు
Megaverse | చిరంజీవి ‘మెగావర్స్’ ప్రోమోకు హరీష్ శంకర్ దర్శకత్వం.. నవంబర్ 4న హైదరాబాద్‌లో ప్రత్యేక షూటింగ్!
Cyclone Murasu | మురాసు తుపాను ప్రభావం.. తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు!
RGV | హింసకు సినిమాలే కారణమంటే… కిడ్నాప్‌లకు రామాయణాన్ని అనాల్సిందే: ఆర్జీవీ
IND vs NZ | ఇషాన్, శ్రేయస్ అర్ధశతకాలు వృథా.. చివరి టీ20లో భారత్‌కు ఓటమి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

