Petrol Pump | డబ్బు చెల్లించమన్నందుకు తన కారుతో పెట్రోల్ పంప్ ఉద్యోగిపైకి దూసుకెళ్లిన పోలీసు.. వీడియో వైరల్
Petrol Pump | కేరళ రాష్ట్రం కన్నూర్ (Kannur)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కారుకు పెట్రోల్ కొట్టించుకున్న ఓ పోలీసు అధికారి.. ఆ తర్వాత అక్కడ పనిచేస్తున్న ఉద్యోగిపైకి దూసుకెళ్లారు.
Petrol Pump | కేరళ రాష్ట్రం కన్నూర్ (Kannur)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కారుకు పెట్రోల్ కొట్టించుకున్న ఓ పోలీసు అధికారి.. ఆ తర్వాత అక్కడ పనిచేస్తున్న ఉద్యోగిపైకి దూసుకెళ్లారు. సిబ్బందిని తన బ్యానెట్‌పై ఎక్కించుకుని అలానే ముందుకు వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన షాకింగ్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ (Viral Video) అవుతోంది.
కన్నూర్ సిటీ పోలీస్ కమిషనర్ అజిత్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్ర పోలీసు శాఖలో పనిచేస్తున్న కె.సంతోష్ కుమార్ ఆదివారం సాయంత్రం తన కారుకు ఇంధనం నింపుకునేందుకు వెళ్లాడు. పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత డబ్బు చెల్లించకుండా అక్కడి నుంచి వెళ్లేందుకు కారును ముందుకు పోనిచ్చాడు. అక్కడే ఉన్న అనిల్ అనే పెట్రోల్ పంప్ (Petrol Pump) ఉద్యోగి.. కారును అడ్డుకున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తాను నింపిన ఇంధనానికి డబ్బు చెల్లించమని అడిగాడు. అందుకు నిరాకరించిన సంతోష్.. సదరు ఉద్యోగిపైకి కారును పోనిచ్చాడు. దీంతో బాధితుడు కారు బ్యానెట్‌పైకి ఎక్కేశాడు. అనంతరం సంతోష్ తన కారును అలాగే కిలోమీటరు మేర ముందుకు పోనిచ్చాడు.
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. ఈ ఘటనలో అనిల్‌కు గాయాలైనట్లు పోలీసు అధికారి అజిత్ కుమార్ తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిపై కేసు నమోదు చేశామని.. సోమవారం అతడిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా సంతోష్ కుమార్‌ను సర్వీస్ నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై బాధితుడు అనిల్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
केरल के कन्नूर में पुलिसकर्मी ने पेट्रोल पंप से पेट्रोल भरवाया कर्मचारी ने पैसे मांगे तो पुलिस वाले ने पेट्रोल पंप कर्मी को टक्कर मार दी और उसे कार की बोनट पर बैठाकर तेज रफ्तार में गाड़ी दौड़ाई.#ViralVideo | #Kerala | #Cop | #PetrolPump pic.twitter.com/zZ2eGehLq2
— Pankaj Singh (@pssingh4244) July 16, 2024
Also Read..
Chandipura Virus | గుజరాత్లో చాందిపురా వైరస్ కలకలం.. ఐదు రోజుల్లో ఆరుగురు చిన్నారులు మృతి
India – Russia | ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించేలా పుతిన్‌తో మాట్లాడండి.. భారత్‌కు అమెరికా విజ్ఞప్తి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

