Rahul Gandhi | భద్రతా లోపాలకు ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత.. దోడా ఉగ్రదాడి ఘటనపై రాహుల్
Rahul Gandhi | జమ్ముకశ్మీర్‌లోని దోడాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో (Encounter) ఆర్మీ అధికారి సహా నలుగురు జవాన్లు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రధాన ప్రతిపక్షనేత, రాయ్‌బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi ) తీవ్రంగా స్పందించారు.
Rahul Gandhi | జమ్ముకశ్మీర్‌లోని దోడాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో (Encounter) ఆర్మీ అధికారి సహా నలుగురు జవాన్లు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రధాన ప్రతిపక్షనేత, రాయ్‌బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi ) తీవ్రంగా స్పందించారు. భారత సైన్యంపై ఉగ్రదాడులు పెరగడం ఆందోళనకరమని పేర్కొన్నారు. ఈ మేరకు మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
ఉగ్రదాడిలో అమరులైన సైనికులకు నివాళులర్పించిన రాహుల్.. ఈ మేరకు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ‘ఈరోజు జమ్మూకశ్మీర్‌లో జరిగిన మరో ఉగ్రవాద ఎన్కౌంటర్లో మన సైనికులు వీరమరణం పొందారు. అమరవీరులకు నా నివాళి. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గత కొన్ని నెలలుగా జమ్మూకశ్మీర్‌లో భారత సైనికులపై ఉగ్రదాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. బీజేపీ తప్పుడు విధానాలే ఈ పరిస్థితికి కారణం. పదే పదే భద్రతా లోపాలకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి. ఇది ప్రతి దేశభక్తిగల భారతీయుడి డిమాండ్. ఉగ్రవాదులపై కఠినమైన చర్యలు తీసుకోవాలి’ అని రాహుల్ ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.
జమ్ముకశ్మీర్‌లోని దోడాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో (Encounter) ఆర్మీ అధికారి సహా నలుగురు జవాన్లు వీరమరణం పొందారు. దోడా జిల్లాలోని దెసా అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భారత సైన్యం, స్థానిక పోలీసులు సోమవారం రాత్రి 7.45 గంటలకు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో టెర్రరిస్టులు, భద్రతాసిబ్బందికి మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు ఆర్మీ సిబ్బందితోపాటు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని దవాఖానకు తరలించగా ఆర్మీ అధికారితోపాటు మరో ముగ్గురు జవాన్లు మరణించారని అధికారులు తెలిపారు. ఇక గడిచిన 32 నెలల కాలంలో జమ్మూ ప్రాంతంలో చోటు చేసుకున్న ఉగ్రదాడి ఘటనల్లో 48 మంది సైనికులు వీరమరణం పొందడం ఆందోళన కలిగిస్తోంది.
Also Read..
Soldiers | జమ్మూలో ఉగ్రవాదుల ఘాతుకాలు.. 32 నెలల్లో 48 మంది జవాన్ల వీరమరణం
Encounter | జమ్ములో ఎన్కౌంటర్.. ఆర్మీ అధికారి సహా నలుగురు జవాన్లు వీరమరణం
Mehbooba Mufti | కశ్మీర్‌కు వచ్చే సైనికులు శవపేటికల్లో వెనుతిరుగుతున్నారు : మెహబూబా ముఫ్తీ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mobile Blast | క్లినిక్‌లో పేలిన మొబైల్ ఫోన్.. భయంతో రోగుల పరుగులు.. Video
‘పట్టభద్రులు ఓటు నమోదులో భాగస్వాములు కావాలి’
ప్రజావాణికి స్పందన కరువు
Ar Rahman | అందరినీ సంతృప్తి పరచడం సాధ్యం కాదు.. ‘రామాయణ’ విమర్శలపై ఏఆర్ రెహమాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Rajasthan | రోడ్డు నిర్మాణ పనుల్లో కరెంట్ షాక్.. 8 మంది కార్మికులు దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

