Unfriendliest Cities | కొత్తవారితో స్నేహం చేయాలనుకుంటున్నారా..? అయితే ముంబై (Mumbai), ఢిల్లీ (Delhi) నగరాల్లో అది సాధ్యం కాదు. ఎందుకంటే ఆ రెండు నగరాలు ఇప్పుడు ‘అన్ ఫ్రెండ్లీ సిటీ’ల (Unfriendliest Cities) జాబితాలో నిలిచాయి. ది కమ్యూనిటీ స్పిరిట్ ఇండెక్స్ : ది వరల్డ్స్ ఫ్రెండ్లీఎస్ట్ సిటీస్ ఫర్ నాన్ నేటివ్స్ పేరుతో ప్రపంచంలోని 53 నగరాల్లో నిర్వహించిన సర్వేలో ఈ ఫలితాలు వెల్లడయ్యాయి. ఆయా నగరాల్లోని ప్రజలు స్థానికేతరుల పట్ల ఎలా ప్రవర్తిస్తారనే అంశాల ఆధారంగా ఈ ఫలితాలను వెల్లడించారు.
ప్రపంచ వ్యాప్తంగా అత్యంత స్వాగతించే, అనుకూలమైన నగరాలను గుర్తించడానికి ఈ
సర్వే ఆరు కీలక అంశాలను పరిగణలోకి తీసుకుంది. సందర్శకులు రాబడి రేటు, భద్రతా రేటింగ్స్, LGBTQ+ సమానత్వం, ఓవర్ ఆల్ హ్యాపీనెస్, సాధారణ భాష ద్వారా కమ్యూనికేషన్ సౌలభ్యం, సిబ్బంది స్నేహపూర్వకంగా (ఫ్రెండ్లీ స్టాఫ్) వ్యవహరించే తీరు వంటి అంశాల ఆధారంగా సర్వే నిర్వహించారు.
ఈ సర్వేలో ముంబై, ఢిల్లీ అన్ ఫ్రెండ్లీ సిటీల జాబితాలో చేరాయి. ఇక ఆఫ్రికా దేశం ఘనా (Ghana) రాజధాని అక్రా స్థానికేతరులతో అత్యంత తక్కవ స్నేహపూర్వక నగరంగా నిలిచింది. మొత్తం 10 పాయింట్లకు అక్రాకు కేవలం 3.12 స్కోర్ లభించింది. మెరాకోలోని మర్రకేజ్ 3.69 స్కోర్ తో రెండో స్థానంలో ఉంది. ముంబై, కౌలాలంపూర్, రియో డి జెనీరో, ఢిల్లీ నగరాలు అన్ఫ్రెండ్లీ జాబితాలో ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి.
మరోవైపు ప్రపంచంలో ఫ్రెండ్లీగా ఉండే నగరాల జాబితాలో కెనడాలోని టొరంటో (Toronto) , ఆస్ట్రేలియా నగరం సిడ్నీ ( Sydney) లు స్థానికేతరులతో చాలా స్నేహపూర్వకంగా ఉన్నట్లు తేలాయి. రెండూ 10కి 7.97 స్కోర్ సాధించాయి. ఈ రెండు కూడా ఫ్రెండ్లీ నగరాల జాబితాలో మొదటి స్థానంలో నిలిచాయి. ఎడిన్ బర్గ్, మాంచెస్టర్ రెండు, మూడు స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఎడిన్బర్గ్ 100కి 68.92 సేఫ్టీ ఇండెక్స్ స్కోర్‌తో 7.78 అత్యధిక స్నేహపూర్వక స్కోర్‌ను అందుకుంది. మాంచెస్టర్ 10కి 7.72 స్కోర్ చేసింది. స్నేహితులను ఎలా సంపాదించుకోవాలనే సెర్చ్ చేసిన నగరాల జాబితాలో బ్రెజిల్ లోని సావోపాలో ఫస్ట్ ప్లేస్ లో ఉండగా.. న్యూయార్క్, పారిస్ నగరాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ప్రపంచంలో ఫ్రెండ్లీగా ఉండే నగరాల జాబితాలో భారతదేశం నుంచి ఒక్క నగరం కూడా చోటు దక్కించుకోలేదు. అయితే, దేశ రాజధాని ఢిల్లీ 17 శాతం కాగా, ముంబై కేవలం 12 శాతం మాత్రమే ఫ్రెండ్లీగా ఉంటుందని ఈ సర్వేలో తేలింది. ఫ్రెండ్లీ స్టాఫ్ కేటగిరీలో ముంబై 3.91% రేటింగ్‌ను సాధించగా.. ఢిల్లీ 3.27% సాధించింది. హ్యాపీనెస్ స్కోర్ లో ముంబై 3.78, ఢిల్లీ 4.01 స్కోర్ సాధించాయి.
Also Read..
Earthquake | ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాలను వణికించిన భూకంపం
Tamanna-Vijay Varma | విజయ్ వర్మతో డేటింగ్.. ఎట్టకేలకు పెదవి విప్పిన మిల్కీ బ్యూటీ
Rajasthan woman | బలవంతంగా రెండో పెళ్లి.. భర్తకు రాఖీ కట్టిన రాజస్థాన్ యువతి