Tamanna-Vijay Varma | విజయ్ వర్మతో డేటింగ్.. ఎట్టకేలకు పెదవి విప్పిన మిల్కీ బ్యూటీ
Tamanna-Vijay Varma | గతకొన్ని రోజులుగా టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా (Tamanna), బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో (Vijay Varma) డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. విజయ్ వర్మతో తనకున్న బంధంపై తమన్నా ఎట్టకేలకు పెదవి విప్పింది. విజయ్ తో రిలేషన్ షిప్ నిజమేనని ఒప్పుకుంది.
Tamanna-Vijay Varma | గతకొన్ని రోజులుగా టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా (Tamanna), బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో (Vijay Varma) డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. న్యూ ఇయర్ పార్టీలో వీరిద్దరూ ముద్దుపెట్టుకున్న వీడియో ఓ సంచలనమే రేపింది. దాంతో వీళ్లిద్దరూ రిలేషన్లో ఉన్నారంటూ బాలీవుడ్, టాలీవుడ్ సహా సోషల్ మీడియా సైతం కోడై కూసింది. అంతేకాకుండా వీరిద్దరూ పలు పార్టీలకు కలిసి వెళ్తూ మీడియా కంట పడ్డారు. ఈ విషయమై ఎన్నిసార్లు అడిగినా ఇరువురూ స్పందించలేదు.
ఈ నేపథ్యంలో తాజాగా విజయ్ వర్మతో తనకున్న బంధంపై తమన్నా ఎట్టకేలకు పెదవి విప్పింది. విజయ్ తో రిలేషన్ షిప్ నిజమేనని ఒప్పుకుంది. ‘లస్ స్టోరీస్ 2’ (Lust Stories 2) సెట్స్ లో తమ ప్రేమ కథ మొదలైనట్లు వెల్లడించింది. ఈ చిత్రంలో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ జంట మధ్య పరిచయం ఏర్పడి.. అదికాస్తా ప్రేమగా మారినట్లు తెలిపింది.
చిత్ర ప్రొమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా.. విజయ్ వర్మతో రిలేషన్ షిప్ పై మాట్లాడారు. ‘సహనటుడు అనే కారణంగా విజయ్ వర్మను ఇష్టపడలేదు. నాకు చాలా మంది సహ నటులు ఉన్నారు. కానీ విజయ్ ప్రత్యేకమైన వ్యక్తి. నాకు రక్షణగా నిలబడతాడనే నమ్మకం ఉంది.నా మనసుకు దగ్గరైన వ్యక్తి. నాపట్ల చాలా శ్రద్ధ వహిస్తాడు. తను ఉన్న చోటే నాకు సంతోషకరమైన ప్రదేశం’ అంటూ చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం తమన్నా..చిరంజీవి నటిస్తున్న ‘భోళా శంకర్’ సహా టాలీవుడ్, బాలీవుడ్ లో పలు చిత్రాలతో బిజీగా ఉంది.
Also Read..
Bengaluru | తల్లిని హత్య చేసి.. శవాన్ని సూట్‌కేసులో కుక్కి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన మహిళ
Bengaluru Rains | బెంగళూరును ముంచెత్తిన వర్షం.. నదులను తలపిస్తున్న కాలనీలు
Jack Dorsey: భారత ప్రభుత్వం వత్తిడి తెచ్చింది.. ట్విట్టర్ మాజీ సీఈవో ఆరోపణ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

