Murder | లక్నో : ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో దారుణం జరిగింది. ఓ హోటల్లో తన తల్లితో పాటు నలుగురు చెల్లెళ్లను హత్య చేశాడు ఓ యువకుడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సెంట్రల్ లక్నో డిప్యూటీ కమిషనర్ రవీణ త్యాగి తెలిపిన వివరాల ప్రకారం.. రాజధాని లక్నోలోని శరణ్జిత్ హోటల్లో ఓ యువకుడు తన తల్లి, నలుగురు చెల్లెళ్లతో దిగాడు. తల్లి, చెల్లెళ్లు గాఢ నిద్రలోకి జారుకున్న తర్వాత సోదరుడు అత్యంత దారుణంగా హతమార్చాడు. హోటల్ సిబ్బంది సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.
మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతులను ఆలియా(9), అల్షియా(19), అక్ష(16), రహమీన్(18), తల్లి ఆస్మాగా పోలీసులు గుర్తించారు. నిందితుడు ఆర్షద్(24) ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. కుటుంబ కలహాల కారణంగానే ఆర్షద్ తన కుటుంబ సభ్యులను హతమార్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. వీరంతా ఆగ్రాకు చెందిన వారని పోలీసులు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Tejasvi Surya | ప్రముఖ గాయని శివశ్రీని పెళ్లాడనున్న ఎంపీ తేజస్వి సూర్య
Africa | చీలిపోతున్న ఆఫ్రికా ఖండం.. కోటి సంవత్సరాల్లో మరో మహా సముద్రం ఆవిర్భావం
Hyderabad | కొత్త సంవత్సరం వేడుకలు.. హైదరాబాద్లో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు