Tejasvi Surya | బెంగళూరు : దేశంలోనే అత్యంత పిన్న వయస్సు ఎంపీలలో ఒకరిగా గుర్తింపు పొందిన తేజస్వి సూర్య ఓ ఇంటివారు కాబోతున్నారు. బెంగళూరు సౌత్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున వరుసగా రెండోసారి గెలిచిన తేజస్వి సూర్య.. చెన్నైకి చెందిన ప్రముఖ గాయని, శాస్త్రీయ సంగీతం, భరతనాట్య కళాకారిణి అయిన శివశ్రీ స్కంద ప్రసాద్‌ను పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని ఎంపీ తేజస్వి సూర్యనే బెంగళూరులో నిన్న ప్రకటించారు. మార్చి 24వ తేదీన బెంగళూరులోనే ఆయన వివాహం జరగనుంది.
శివశ్రీ శాస్త్ర యూనివర్సిటీ నుంచి బయో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. మద్రాస్ యూనివర్సిటీ నుంచి భరతనాట్యంలో ఎంఏ, మద్రాస్ సంస్కృత కాలేజీలో సంస్కృతంలో ఎంఏ పట్టా పుచ్చుకున్నారు. పొన్నియిన్ సెల్వన్ పార్ట్ -2లో కన్నడ వర్షన్లో శివశ్రీ ఓ పాట ఆలపించారు. ఆమె యూట్యూబ్ చానెల్‌కు 2 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు.
తేజస్వి సూర్య వృత్తి రీత్యా లాయర్. కానీ ప్రస్తుతం ఆయన బెంగళూరు సౌత్ నియోజకవర్గం నుంచి పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2024 ఎంపీ ఎన్నికల్లోనూ ఆయన గెలుపొందారు. 2019 ఎన్నికల్లో 3.31 లక్షల ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు. తేజస్వి చేతిలో కాంగ్రెస్ నేత బీకే హరిప్రసాద్ ఓడిపోయారు. 2020 నుంచి భారతీయ జనతా యువ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
ఇవి కూడా చదవండి..
Temples | న్యూ ఇయర్ వేళ ఆలయాలకు పోటెత్తిన భక్తులు
China | మళ్లీ హద్దు మీరిన చైనా.. సరిహద్దు చర్చల వేళ దుందుడుకు చర్య
Africa | చీలిపోతున్న ఆఫ్రికా ఖండం.. కోటి సంవత్సరాల్లో మరో మహా సముద్రం ఆవిర్భావం