Hyderabad | హైదరాబాద్ : కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో మంగళవారం రాత్రి భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు అయ్యాయి. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1,184, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 619 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈస్ట్ జోన్లో అత్యధికంగా 270 కేసులు, సౌత్ ఈస్ట్ జోన్లో 192, వెస్ట్ జోన్లో 179, సౌత్ వెస్ట్ జోన్లో 179, నార్త్ జోన్లో 177, సౌత్ జోన్లో 119, సెంట్రల్ జోన్లో 102 కేసులు నమోదు అయ్యాయి.
రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఎల్బీనగర్ డివిజన్లో అత్యధికంగా 232, మల్కాజ్గిరి డివిజన్లో 230, భువనగిరి డివిజన్లో 84, మహేశ్వరం డివిజన్లో 47 కేసులు నమోదైనట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Medchal | 315 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా.. ప్రభుత్వ భూముల రక్షణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
Bullet Bike | బుల్లెట్ కన్పించిందా మాయం చేస్తారు! ఇద్దరు దొంగల అరెస్ట్.. 30 బైక్లు స్వాధీనం
Hyderabad | ఖరీదైన స్థలానికి పటిష్ట చర్యలు.. ‘నమస్తే తెలంగాణ’ కథనానికి స్పందన..