Masood Azhar | అఫ్గనిస్తాన్‌లో కాదు పీఓకేలో తలదాచుకున్న మసూద్ అజార్.. ఈ రుజువు సరిపోదా..?
Masood Azhar : నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ (Masood Azhar) పాక్ ఆక్రమిత కశ్మీర్(POK)లో తలదాచుకున్నాడు. పీఓకేలోని గిల్జిత్ బల్టిస్థాన్ అనే ప్రాంతంలో అతడి కదలికల్ని భారత నిఘా వర్గాలు గుర్తించాయి.
Masood Azhar : నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ (Masood Azhar) పాక్ ఆక్రమిత కశ్మీర్(POK)లో తలదాచుకున్నాడు. పీఓకేలోని గిల్జిత్ బల్టిస్థాన్ అనే ప్రాంతంలో అతడి కదలికల్ని భారత నిఘా వర్గాలు గుర్తించాయి. తన స్థావరమైన బహవల్పురాకు దాదాపు 1,000 కిలోమీటర్ల దూరంలో అతడు ఉన్నట్టు ఇంటెలిజెన్స్ టీమ్ తెలిపింది.
భారత సైన్యం నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’లో10 మంది కుటుంబ సభ్యులను కోల్పోయిన మసూద్ కొద్దిలో బతికిపోయాడు. సురక్షిత స్థావరానికి వెళ్లి ప్రాణాలు కాపాడుకున్న అతడు ఈమధ్యే స్కర్దులోని సద్పర రోడ్డు పరిసరాల్లో కనిపించాడు. అతడు ఆశ్రయం పొందుతున్న చోట రెండు మసీదులు, వాటి అనుబంధ మదర్సాలతో పాటు పలు ప్రైవేట్, ప్రభుత్వ అతిథి గృహాలు ఉన్నాయని సమాచారం. నిఘా వర్గాలు తెలిపిన వివరాలతో.. పాకిస్థాన్ ఉగ్రవాదులకు అండగా ఉంటుందనడానికి మరోసారి నిరూపితం అయిందని భారత సైన్యం అంటోంది.

భారత దేశం జాబితాలోని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులలో మసూద్ ఒకడు. నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌ను స్థాపించిన మసూద్ 2016లో పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడితో పాటు 2019లో పుల్వామా దాడికి సూత్రధారి. అతడిని అంతమొందించాలని భారత సైన్యం బాలాకోట్ ఎయిర్ స్ట్రయిక్ చేసింది. కానీ, తప్పించుకొని సురక్షితమైన ప్రాంతానికి వెళ్లాడు మసూద్. ఈమధ్యే పహల్గాం ఉగ్రదాడికి ప్రతిచర్యగా ఇండియన్ ఆర్మీ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’లో మసూద్ కుటుంబం భూస్థాపితమైంది.
జైషే మహ్మద్ ఉగ్ర సంస్థకు ప్రధాన కేంద్రమైన జమియా సుభాన్ అల్లా ప్రాంతంపై భారత సైన్యం జరిపిన మెరుపు దాడుల్లో అతడి సోదరుడు సహా పది మంది సన్నిహితులు హతమయ్యారు. అయితే.. మసూద్‌తో తమకు ఏ సంబంధం లేని పాక్ నేతలు ప్రగల్భాలు పలికారు. మసూద్ అఫ్గనిస్థాన్‌కు పారిపోయి ఉంటాడని ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో అన్నాడు. ఒకవేళ భారత నిఘా వర్గాలు అతడిని పీఓకేలో గుర్తించినట్టు తమ దృష్టికి వస్తే.. సంతోషంగా అరెస్ట్ చేస్తామని భుట్టో తెలిపాడు.
ఇవి కూడా చదవండి
- Students carrying milk packets | ఇక్కడ విద్యార్థులే అటెండర్లు.. వారితో పాల ప్యాకెట్ మోపిస్తున్న కాంట్రాక్టర్
- Collector Santhosh | ఉద్యాన పంటల సాగు వైపు ప్రోత్సహించి రైతుల ఆదాయం పెరిగేలా చేయాలి : కలెక్టర్ బీఎం సంతోష్
- రోడ్ల మరమ్మతులపై నిరసన.. రోడ్లపై వరినాట్లేసి కాంగ్రెస్ ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దగ్ధం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fake Potatoes | మార్కెట్లో విరివిగా కల్తీ ఆలుగడ్డలు.. గుడ్డిగా కొనుగోలు చేస్తే అంతే సంగతి..!
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

