Maha kumbh | ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాకు (Maha Kumbh) భక్తులు (pilgrims) పోటెత్తుతున్నారు. గంగా, యమున, సరస్వతీ నదులు కలిసే త్రివేణీ సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి అంచనాలకు మించి తరలివస్తున్నారు. ఈ కుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ దాదాపు 14 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం (Uttar Pradesh Government) తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
#WATCH | Prayagraj | Devotees continue to arrive at Triveni Sangam to participate in the world’s biggest religious congregation, #MahaKumbh2025 pic.twitter.com/2thBR8idaD
— ANI (@ANI) January 27, 2025
కుంభమేళా ప్రారంభైన జనవరి 13వ తేదీ నుంచి ఈనెల 26వ తేదీ వరకూ త్రివేణీ సంగమంలో 13.21 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు వెల్లడించింది. అందులో 10 లక్షల మంది కల్పవాసీలు కూడా ఉన్నట్లు పేర్కొంది. ఇక ఇవాళ ఉదయం 8 గంటల వరకూ దాదాపుగా 46.64 లక్షల మంది స్నానాలు ఆచరించినట్లు అధికారులు తెలిపారు.
#Mahakumbh2025 | More than 13.21 crore devotees have taken holy bath during Mahakumbh in Prayagraj till 26th January
— ANI (@ANI) January 27, 2025
సంక్రాంతి రోజున ప్రారంభమైన (జనవరి 13) మహా కుంభమేళా ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రితో ముగుస్తుంది. 45 రోజులపాటు సాగనున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరయ్యే భక్తుల సంఖ్య 50 కోట్లు దాటుతుందని యూపీ సర్కార్ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో కోట్లాది మందికి తగిన రీతిలో ఏర్పాటు చేసింది యూపీ ప్రభుత్వం.
#WATCH | #MahaKumbh2025 | Devotees take a holy dip at Triveni Sangam in Prayagraj. As per UP Information Department, 46.64 lakh devotees have taken a holy dip here today so far.
Sonu Kumar Yadav from Jharkhand says, “I arrived here last evening and stayed here overnight. There… pic.twitter.com/BFYOi0UJO1
— ANI (@ANI) January 27, 2025
Also Read..
Amit Shah | మహాకుంభమేళాలో అమిత్ షా.. త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు
Mahakumbh: పుణ్యస్నానం కోసం కుంభమేళాకు.. పోలీసులకు చిక్కిన లిక్కర్ స్మగ్లర్
Manchu Lakshmi | ఈ విధంగా ఎయిర్‌లైన్స్‌ను ఎలా నడుపుతున్నారు..? ఇండిగో సంస్థపై మంచు లక్ష్మి ఫైర్