ఖైరతాబాద్, మార్చి 14: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) మాటున మంత్రి గడ్డం వివేక్, ఆయన సోదరుడు గడ్డం వినోద్ రూ. కోట్లు కొల్లగొట్టారని సాగర్ క్రికెట్ క్లబ్ కార్యదర్శి చాతిరి బా బూరావుసాగర్ ఆరోపించారు. హెచ్‌సీఏ లో 20 ఏండ్లపాటు వివిధ పదవుల్లో ఉన్న వివేక్, వినోద్ లోపాయికారిగా తమకు అనుకూలమైన ఒప్పందాలు చేసుకొని ని ధులను తమ విశాఖ సంస్థకు మళ్లించుకున్నారని తెలిపారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బాబూరావు శనివారం మీడియాతో మాట్లాడారు. ఉప్పల్‌లో నిర్మించిన క్రికెట్ స్టేడియానికి నాటి తెలుగుదేశం ప్రభుత్వం భూమి కేటాయించిందని, స్టేడియం నిర్మాణానికి స్పాన్సర్‌గా విశాఖ ఇండస్ట్రీస్ ముం దుకొచ్చిందని తెలిపారు. స్టేడియం నిర్మాణానికి రూ.6 కోట్లు ఇస్తామని విశాఖ సంస్థ అధిపతి వివేక్ తెలిపారని, తమ ప్రయోజనాలకు భంగం కలిగితే ఆరు రెట్లు నష్టపరిహారం చెల్లించాలని ఒప్పం దం చేసుకున్నారని వివరించారు.
ఈ ఒప్పందంలో నాటి కార్యదర్శి శివలాల్ యాదవ్, వైస్ ప్రెసిడెంట్‌గా జీ వినోద్, వివేక్ భాగస్వాములని తెలిపారు. ఈ ఒ ప్పందం గురించి కమిటీ సభ్యులెవరికీ తెలుపలేదని, జనరల్ బాడీలో చర్చించలేదని చెప్పారు. ఒప్పందంలో భాగంగా స్టేడియానికి విశాఖ పేరు పెట్టాలని ప్రతిపాదించారని, ఇందుకు నాటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అంగీకరించలేదని తెలిపా రు. మధ్యేమార్గంగా రాజీవ్‌గాంధీ పేరు పె ట్టారని గుర్తుచేశారు. ఈ మార్పు ఇష్టం లేనప్పుడు వివేక్, వినోద్ అప్పుడే వైదొలగాల్సి ఉండేదని అన్నారు. స్టేడియానికి పేరు మార్పు సీఎం నిర్ణయమని, ఇందు లో హెచ్‌సీఏ తప్పిదమేమీ లేదని చెప్పా రు. ఈ క్రమంలో లీజు రద్దు కావడంతో తమకు నష్టపరిహారం చెల్లించాలని వివేక్ కోర్టుకు వెళ్లారని తెలిపారు. అప్పటికీ వారు స్టేడియం కోసం వెచ్చించింది రూ.4.32 కోట్లు మాత్రమేనని వివరించా రు.
2004 నుంచి 2017 వరకు వినోద్, వివేక్ హెచ్‌సీఏలో వివిధ పదవుల్లో ఉం టూనే తమ విశాఖ సంస్థ తరఫున హెచ్‌సీఏపై కేసులు వేశారని చెప్పారు. ఇటు హెచ్‌సీఏ తరఫున తమకు అనుకూలమైన న్యా యవాదిని నియమించి విశాఖకు అనుకూలంగా తీర్పు వచ్చేలా ప్రయత్నించారని వివరించారు. 2016లో కోర్టు తీర్పు వచ్చినప్పుడు కూడా వివేక్ హెచ్‌సీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఉన్నారని, కానీ ఆ సమస్య ను పరిష్కరించేందుకు బదులుగా విశాఖ తరఫున లబ్ధిదారుడు తానే గనుక ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించా రు.
2017లో హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌గా ఉన్న వివేక్ విశాఖ సంస్థకు అనుకూలంగా మాట్లాడారని ఆరోపించారు. విశాఖ సంస్థ తరఫున నష్టపరిహారంగా రూ.70 కోట్లు క్లెయిమ్ చేస్తూ మరోవైపు హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌గా ఉంటూ ఆ పరిహారం చెల్లించేవిధంగా చర్యలు తీసుకున్నారని వివరించా రు. కేవలం రాజీవగాంధీ పేరు పెట్టినందు కు డ్యామేజ్ సూట్ వేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. 20 ఏండ్లుగా హెచ్‌సీఏలో రూ. కోట్లు మంత్రి సంస్థకు బదిలీ అయ్యాయని విమర్శించారు.
హెచ్‌సీఏలో రూ. కోట్ల నిధుల కుంభకోణం విషయంలో ప్రభుత్వం దర్యాప్తు జరపాలని బాబూరావు డిమాండ్ చేశారు. అసోసియేషన్‌లో జమచేసిన రూ.100 కోట్ల నిధులు మంత్రి సంస్థకు చెందిన ఖాతాకు వెళ్లాయని అన్నారు. సీఎం రేవంత్ వెంటనే కలుగజేసుకోవాలని కోరారు.