ఆదివారం 07 మార్చి 2021
National - Jan 27, 2021 , 20:49:03

భారత్‌కు బయలుదేరిన మరో మూడు రాఫెల్స్‌

భారత్‌కు బయలుదేరిన మరో మూడు రాఫెల్స్‌

న్యూఢిల్లీ: మరో మూడు రాఫెల్‌ యుద్ధ విమానాలు ఫ్రాన్స్‌ నుంచి భారత్‌కు బుధవారం బయలుదేరాయి. యూఏఈ ఎంఆర్టీటీ ద్వారా గాలిలోనే నింధనం నింపుకున్న ఈ జెట్స్‌ ఏకధాటిగా ప్రయాణించి గుజరాత్‌లోని జామ్‌నగర్‌ ఎయిర్‌ బేస్‌కు రాత్రి 11 గంటలకు చేరనున్నాయి. అత్యాధునిక యుద్ధ విమానాలైన 36 రాఫెల్స్‌ను రూ.59 వేల కోట్ల వ్యయంతో కొనుగోలు చేసేందుకు 2016లో ఫ్రాన్స్‌తో భారత్‌ ఒప్పందం చేసుకున్నది. 

గత ఏడాది జూలై 29న తొలి బ్యాచ్‌గా ఐదు రాఫెల్స్‌ పంజాబ్‌లోని అంబాలా ఎయిర్‌ బేస్‌కు చేరుకున్నాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వాటిని లాంఛనంగా భారత వాయుసేనలోకి ప్రవేశపెట్టారు. గత ఏడాది నవంబర్‌లో రెండో బ్యాచ్‌ కింద మూడు రాఫెల్స్‌ జామ్‌నగర్‌ ఎయిర్‌ బేస్‌కు చేరాయి. తాజాగా మరో మూడు రాఫెల్స్‌ బుధవారం రాత్రికి జామ్‌నగర్‌ ఎయిర్‌ బేస్‌కు చేరుతాయి. దీంతో ఐఏఎఫ్‌లో రాఫెల్స్‌ సంఖ్య 11కు చేరనున్నది. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo