Monsoon | రైతన్నకు శుభవార్త. వ్యవసాయానికి ఊతమిచ్చే నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) శనివారం కేరళను (Kerala) తాకాయి. దాదాపు ఎనిమిది రోజులు ముందుగానే కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించినట్లు (8 days before schedule) భారత వాతావరణ శాఖ (IMD) శనివారం తెలిపింది. 2009 తర్వాత రుతుపవనాలు అంచనాల కంటే ముందుగా రావడం ఇదే మొదటిసారి. చివరిసారిగా 2009, 2001 సంవత్సరాల్లో ఇంత త్వరగా రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. అప్పుడు మే 23న రాష్ట్రాన్ని రుతుపవనాలు తాకాయి. ఇప్పుడు 16 ఏళ్ల తర్వాత మళ్లీ ఇంత తొందరగా రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించడం ఇదే తొలిసారి.
Southwest Monsoon has set in over Kerala, today the 24 th May 2025:
Southwest Monsoon has set in over Kerala today, the 24th May, 2025, against the normal date of 1st June. Thus, southwest monsoon has set in over Kerala 8 days before the normal date. This is the earliest date… pic.twitter.com/n9TcdkG3Ym
— India Meteorological Department (@Indiametdept) May 24, 2025
సాధారణంగా ఏటా జూన్ 1 నాటికి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయి. జూలై 8 వరకు అవి దేశమంతా విస్తరిస్తాయి. మళ్లీ వాయువ్య భారతం నుంచి సెప్టెంబర్ 17తో రుతుపవనాల ఉపసంహరణ మొదలవుతుంది. అది అక్టోబర్ 15 నాటికి ముగుస్తుంది. గతేడాది మే 30న నైరుతి రుతుపవనాలు రాగా, 2023లో జూన్ 8న ప్రవేశించాయి. 1918లో తొలిసారిగా చాలా తొందరగా కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. అప్పుడు మే 11నే రాష్ట్రాన్ని తాకాయి. ఇప్పటి వరకూ ఇదే తొలి రికార్డుగా ఉంది. ఇక రాష్ట్రాన్ని చాలా ఆలస్యంగా రుతుపవనాలు తాకింది 1972లోనే. అప్పుడు సాధారణం కంటే చాలా ఆలస్యంగా జూన్ 18న ప్రారంభమయ్యాయి.
బంగాళాఖాతంలో అల్పపీడనం
అరేబియా మహాసముద్రంలో కొనసాగుతున్న అల్పపీడనం, ఈ నెల 27న పశ్చిమ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుండటంతో తెలంగాణలో నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, ములు గు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది. ఆ యా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూ చించింది. అటు ఏపీలోనూ రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
అరేబియా మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశముందని ఐఎండీ అధికారులు వెల్లడించారు. వాయుగుండం తీవ్రవాయుగుండంగా లేదా తుఫాన్‌గా బలపడవచ్చని చెప్పారు. కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశమున్నదని తెలిపారు.
Also Read..
UN | ఉగ్రదాడుల్లో 20,000 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు.. యూఎన్‌లో పాక్‌పై విరుచుకుపడిన భారత్
Shashi Tharoor | ఉగ్రవాదం విషయంలో భారత్ మౌనంగా ఉండదు : శశి థరూర్
Donald Trump | యాపిల్నేకాదు.. శాంసంగ్‌నూ టార్గెట్ చేసిన ట్రంప్