Loksabha Elections 2024 : దశాబ్ధాల కాంగ్రెస్ పాలనలో భారీ కుంభకోణాలు మినహా ఎలాంటి అభివృద్ధి జరగలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒడిషాలోని కేంద్రపారాలో బుధవారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీని ఉద్దేశించి మోదీ మాట్లాడారు.
గత పదేండ్ల పాలనలో తమ ప్రభుత్వం దేశాన్ని అన్ని రంగాల్లో ప్రగతి బాట పట్టించిందని చెప్పారు. రాష్ట్రాన్ని లూటీ చేస్తున్న పాలకులకు బుద్ది చెప్పాలని ఒడిషా ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ఈసారి ఒడిషాలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని నెలకొల్పాలని ప్రజలు నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు.
ఒడిషాలోనే కాకుండా దేశంలో మరోసారి పటిష్ట ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి మరోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Read More :
Bengaluru Rave Party | బెంగళూరు రేవ్ పార్టీ కేసు.. హేమకు మరోసారి నోటీసులు