కౌంటింగ్ పూర్తయిన వారం వరకు వీవీప్యాట్ లెక్కింపునకు అవకాశం.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వెల్లడి
ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా అభ్యర్థులు ఎవరికైనా ఫలితాలపై అనుమానాలు ఉంటే వాటిని నివృత్తి చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఎన్నికల కమిషన్ తాజాగా నిర్ణయించింది.
న్యూఢిల్లీ: ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా అభ్యర్థులు ఎవరికైనా ఫలితాలపై అనుమానాలు ఉంటే వాటిని నివృత్తి చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఎన్నికల కమిషన్ తాజాగా నిర్ణయించింది. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన 7 రోజుల వరకు ఈవీఎంలో నమోదైన ఓట్లతో వీవీప్యాట్లను సరిచూసుకునేందుకు అనుమతి ఇస్తున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెల్లడించారు. అభ్యర్థులు తగిన రుసుము చెల్లించి వీవీప్యాట్‌తో ఈవీఎంలో నమోదైన ఓట్లను సరిచూసుకోవచ్చని ఆయన చెప్పారు.
శుక్రవారం చెన్నైలో విలేకరుల సమావేశంలో సీఈసీ మాట్లాడుతూ కొత్తగా తీసుకున్న నిర్ణయాల్లో మరో ప్రధాన నిర్ణయం ఈవీఎం కౌంటింగ్ ప్రారంభం కావడానికి 2 రౌండ్ల ముందు పోస్టల్ బ్యాలట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని చెప్పారు. తమిళనాడులో ఇటీవల ముగిసిన సర్ ప్రక్రియ విజయవంతమైందని, ఇది దేశానికే ఆదర్శమని సీఈసీ చెప్పారు. ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాలని తమిళనాడులోని రాజకీయ పార్టీలు సూచించాయని, అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత తగిన నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఎన్ని దశల్లో ఎన్నికలను ఈసీ నిర్వహిస్తుందో తెలుస్తుందని ఆయన వివరించారు. ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఎటువంటి లోపాలు లేకుండా జరిగాయని, తమిళనాడు ఎన్నికలు అంతకన్నా మెరుగ్గా జరుగుతాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు ఆయన తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

