Indian Military | పెహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror Attack)తో భారత్ – పాకిస్థాన్ (Pakistan) మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌కు భారత ఆర్మీ (Indian Army) బలమైన సందేశాన్ని పంపింది. ‘సిద్ధంగా.. అప్రమత్తంగా ఉన్నాం’ అంటూ వీడియోను ఎక్స్‌లో పంచుకుంది. ‘మిషన్ రెడీ.. ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలాగైనా. దేనికీ భయపడం. ఏదీ మమ్మల్ని ఆపదు. ఎల్లప్పుడూ సిద్ధంగానే..’ అంటూ జవాన్ల విన్యాసాలకు సంబంధించిన వీడియోను పంచుకుంది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తుంటే పాక్‌పై భారత్ ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Always Prepared, Ever Vigilant – #IndianArmy pic.twitter.com/NIHWvWF9oM
— ADG PI – INDIAN ARMY (@adgpi) April 26, 2025
కాగా, మంగళవారం మధ్యాహ్నం జమ్ము కశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం పెహల్గామ్లో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరాన్లో ఆర్మీ దుస్తుల్లో అడవిలో నుంచి వచ్చిన ఉగ్రమూక పర్యాటకులపై విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడింది. ఈ నరమేధంలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై భారత్ ఆగ్రహంతో ఉంది. పాకిస్థాన్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ ఘటనకు పాల్పడిన వారికి కలలో కూడా ఊహించని రీతిలో శిక్ష ఉంటుందంటూ ప్రధాని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.
దీనికి తోడు.. ఉగ్రదాడి తర్వాత నియంత్రణ రేఖ వద్ద దాయాదిదేశం కవ్వింపులకు పాల్పడుతోంది. భారత సైనికులపై కాల్పులు జరుపుతోంది. అయితే వాటిని భారత ఆర్మీ సమర్ధవంతంగా తిప్పికొడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో భారత్ – పాక్ మధ్య యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయంటూ అంచనాలు వెలువడుతున్నాయి. అయితే, భారత్ మాత్రం ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. దీంతో దాయాది దేశంపై భారత్ ఏ రకంగా ప్రతీకారం తీర్చుకోబోతోందన్న ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు భారత ఆర్మీ పెట్టిన పోస్ట్ ఈ ఆసక్తిని మరింత పెంచినట్లైంది.
Also Read..
The Resistance Front | ఉగ్రసంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్.. దీని చరిత్ర తెలుసా..?
TRF | పెహల్గామ్ దాడి మా పని కాదు.. మా వ్యవస్థల్ని భారత్ హ్యాక్ చేసింది.. ఉగ్రసంస్థ సంచలన ప్రకటన
Simla Agreement | భారత్ – పాక్ మధ్య ఏమిటీ సిమ్లా ఒప్పందం