కోదాడ, ఫిబ్రవరి 12 : కోదాడ పబ్లిక్ క్లబ్ శాశ్వత సభ్యుడు కత్రం భాస్కర్ రెడ్డి మృతి బాధాకరమని, ఆయన జీవితం చిరస్మరణీయమని మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు అన్నారు. గురువారం కోదాడ పట్టణంలోని పబ్లిక్ క్లబ్ ఆవరణలో ఏర్పాటు చేసిన భాస్కర్‌రెడ్డి సంతాప సభలో క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గాయం పట్టాభి రెడ్డి, బొల్లు రాంబాబు, క్లబ్ సభ్యులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వేనేపల్లి మాట్లాడుతూ.. క్లబ్ అభివృద్ధిలో భాస్కర్‌రెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. తాను ఏ బాధ్యత చేపట్టినప్పటికీ నిబద్ధతతో చేసేవారన్నారు. అనంతగిరి ప్రాథమిక సహకార కేంద్ర అభివృద్ధిలో ఆయన పాత్ర ఎనలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వేనేపల్లి సత్యనారాయణ, ఓరుగంటి రవి, కారుమంచి సత్యనారాయణ, గుండాపునేని వేణుగోపాలరావు, రావెళ్ల సీతారామయ్య, వేనేపల్లి శ్రీనివాసరావు, మాదాల వెంకటేశ్వరరావు, చింతలపాటి శ్రీనివాసరావు, సత్యనారాయణ పాల్గొన్నారు.