– మైనార్టీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ.యాకూబ్ పాషా
రుద్రంపూర్, ఫిబ్రవరి 12 : ‘నీట్’ 2026 కు హాజరు కానున్న ముస్లిం విద్యార్ధులు ఈడబ్ల్యూఎస్ కోటాలో దరఖాస్తు చేసుకోవాలని మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ.యాకూబ్ పాషా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పొందినట్లైతే ఎంబీబీఎస్, డెంటల్, ఆయుష్, బీవీఎస్సీ & ఏహెచ్ వంటి పలు కోర్సుల్లో ప్రవేశాలకు 10 శాతం సీట్లు పొందే అవకాశం ఉంటుందన్నారు. నీట్ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 8 గడువు తేదీ ఉన్నందున ముస్లిం విద్యార్థులు తమ ప్రాంతంలో గల మీ సేవ కేంద్రాల్లో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లు పొందేందుకు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పొందే క్రమంలో రాష్ట్రంలో గల రెవెన్యూ కార్యాలయాల్లో అధికారులు ఏమైనా ఇబ్బందులు పెడితే 8520860785 నంబర్‌కు కాల్ చేసి సంప్రదించాలని పేర్కొన్నారు.