Amit Shah | 2025-26కు సంబంధించిన బడ్జెట్‌ను కేంద్రం ఇవాళ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభ ముందు ఉంచారు. ఈ సందర్భంగా వేతన జీవులకు భారీ ఊరట కల్పించారు. రూ.12 లక్షల వరకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు (Tax Exemption) కల్పించినట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో బడ్జెట్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) స్పందించారు.
మధ్యతరగతి ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) హృదయంలో ఎల్లప్పుడూ స్థానం ఉంటుందన్నారు. సంవత్సరానికి రూ.12 లక్షల ఆదాయం ఉన్న వ్యక్తులకు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేకుండా కేంద్ర బడ్జెట్లో వెసులుబాటు కల్పించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ ప్రకటన మధ్యతరగతి ప్రజల ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రయోజనం పొందిన లబ్ధిదారులందరికీ అమిత్ షా అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ పెట్టారు.
The middle class is always in PM Modi’s heart.
Zero Income Tax till ₹12 Lakh Income.
The proposed tax exemption will go a long way in enhancing the financial well-being of the middle class. Congratulations to all the beneficiaries on this occasion.#ViksitBharatBudget2025
— Amit Shah (@AmitShah) February 1, 2025
కేంద్రం రూ.12 లక్షల వరకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు కల్పించిన విషయం తెలిసిందే. బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మేరకు ప్రకటన చేశారు. రూ.12 లక్షలకు మించిన ఆదాయం ఉన్నవారికి శ్లాబులవారీగా పన్నులను నిర్ణయించారు. రూ.20లక్షల నుంచి రూ.24 లక్షల వరకు 25 శాతం పన్నుగా నిర్ణయించారు. రూ.16 లక్షల నుంచి 20 లక్షల్లోపు ఆదాయంపై 20 శాతం పన్నుగా నిర్ణయించారు. ఈ నిర్ణయం ద్వారా రూ.18 లక్షల వరకు ఆదాయం వచ్చే వారికి రూ.70 వేల వరకు లబ్ధి చేకూరనుంది. అలాగే రూ.25 లక్షల వరకు ఆదాయం వచ్చే వారికి రూ.1.10 లక్షల వరకు లబ్ధి చేకూరనుంది.
Also Read..
Income Tax | వేతన జీవులకు భారీ ఊరట.. 12 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు
Union Budget 2025 | టీవీలు, ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాలు.. ఇంకా వేటి ధరలు తగ్గుతాయంటే..!