Union Budget 2025 | కస్టమ్స్ చట్టంలో కేంద్రం కీలక మార్పులు చేసింది. అలాగే ఏడు రకాల సుంకాలను తగ్గించింది. ఇందులో భాగంగా 36 రకాల ఔషధాలకు బేసిక్ కస్టమ్స్ డ్యూటీని తొలగించింది. దీంతో క్యాన్సర్ మందులు, సర్జికల్ పరికరాల ధరలు భారీగా తగ్గనున్నాయి. లిథియం బ్యాటరీలపైనా కేంద్రం పన్నును తొలగించింది. తద్వారా టీవీలు, మొబైల్, ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గనున్నాయి. అలాగే ఎల్సీడీ, ఎల్ఈడీ ఉత్పత్తులకు కేంద్రం ప్రోత్సాహం అందించనుంది.
– క్యాన్సర్ మందులు
క్యాన్సర్, దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన 36 రకాల ఔషధాల కస్టమ్స్ డ్యూటీని తొలగించడంతో వాటి ధరలు తగ్గనున్నాయి. అలాగే మెడికల్ పరికరాల ధరలు కూడా తగ్గనున్నాయి.
– టీవీలు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు
బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 5 శాతానికి తగ్గించడంతో టీవీలు సహా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు తగ్గనున్నాయి.
– మొబైల్ ఫోన్లు, ఈవీ వాహనాలు
లిథియం బ్యాటరీలపై పన్నును తొలగించడంతో బ్యాటరీల ధరలు తగ్గనున్నాయి. తద్వారా మొబైల్ ఫోన్ల బ్యాటరీ, ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గుతాయి.
– లెదర్ ఉత్పత్తులు(జాకెట్లు, షూస్, బెల్ట్, పర్స్)
– కోబాల్ట్ పౌడర్‌తో పాటు సీసం, జింక్‌తో పాటు మరో 12 ఖనిజాలను బేసిక్ కస్టమ్స్ డ్యూటీ నుంచి పూర్తిగా మినహాయించింది.
– నౌకల తయారీకి అవసరమైన ముడిసరుకులపై కూడా బేసిక్ కస్టమ్స్ డ్యూటీని మినహాయించారు.
– రొయ్యలు, చేపల దాణా
– ఫ్రొజెన్ చేపలు
– ప్లాట్ ప్యానెల్ డిస్ప్లే
– సోషల్ వెల్ఫేర్ సర్‌ఛార్జి