Monkeys vs Dogs Memes | గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. కొన్ని కోతులు కలిసి సుమారు 250 కుక్క పిల్లలను చంపేశాయి. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. తమ కోతి పిల్లను కుక్కలు చంపేశాయని పగతో రగిలిపోయిన కోతులు కుక్కలను వెంటాడి మరీ చంపేశాయి.
కుక్క పిల్లలను పట్టుకొని వాటిని చెట్ల మీదికి, బిల్డింగ్స్ మీదికి తీసుకెళ్లి అక్కడి నుంచి వదిలేసి కిరాతకంగా 250 కుక్కలను కోతులు మట్టుపెట్టాయి. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మాజల్గావ్ అనే గ్రామంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. కోతులు చేస్తున్న దారుణాన్ని చూసిన గ్రామస్తులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వాళ్లు వచ్చి కోతులను పట్టుకోవడానికి ప్రయత్నించినా కుదరలేదు.
ఊళ్లో ఉన్న కుక్క పిల్లలను అన్నింటినీ చంపేసిన కోతులు.. తర్వాత ఊళ్లోని పిల్లలపై విరుచుకుపడటం ప్రారంభించాయి. చివరకు కుక్కలను చంపిన కోతుల్లో రెండు కోతులను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు.
ఈ విషయం నెటిజన్లకు తెలియడంతో.. సోషల్ మీడియాలో ఫన్నీగా మీమ్స్ క్రియేట్ చేయడం ప్రారంభించారు. కోతులు, కుక్కలు ఉన్న ఫోటోలను పెట్టి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కోతులు వర్సెస్ కుక్కలు అన్నట్టుగా మీమ్స్ తయారు చేస్తున్నారు. దీంతో #MonkeyVsDoge అనే హ్యాష్‌టాగ్ ప్రస్తుతం ట్విట్టర్లో వైరల్ అవుతోంది.
మీరు కూడా ఆ ఫన్నీ మీమ్స్‌ను చూసి కాసేపు నవ్వుకోండి.
Bhai! Ye Billiyon ki Saajish hai bata raha hoon.#MonkeyVsDoge pic.twitter.com/aYtoVu1caP
— Ankush (@_James_Bong) December 18, 2021
Doges are on way with Buffalos and cows to Destroy monkey land and Those monkeys who Keeled 250 puppy doges
— #UACTimes//Brahminism Stan🇮🇳 (@uactimes) December 18, 2021
Never forget never forgive.#DogeVsMonke#MonkeyVsDoge
pic.twitter.com/FWrDsMazJf
Monke the mass #MonkeyVsDoge pic.twitter.com/rPS15stK4o
— ︎ ︎ ︎ ︎ ︎ ︎ ︎ ︎ ︎ ︎ ︎ ︎ ︎ ︎ ︎ ︎ ︎ ︎ ︎ ︎ ︎ ︎ ︎ ︎ ︎ (@AnkitYadavTT) December 18, 2021
Doge is heading towards revenge #MonkeyVsDoge pic.twitter.com/XI08b2bj7h
— Ralph (@_iralph) December 18, 2021
WWE between Monkey vs Dog #MonkeyVsDoge pic.twitter.com/yHHnkxkGFv
— Amit Kumar (@MrAmit1086) December 18, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పీటల మీదే పెళ్లి కూతురును లాగి.. ముద్దు పెట్టి పెళ్లికొడుకు రచ్చ: వీడియో వైరల్
Monkeys Kill Dogs | 250 కుక్కలను వేటాడి మరీ చంపేసిన కోతులు.. కారణం ఏంటో తెలుసా?
ప్రాణాలు కాపాడుతున్న ఎయిర్ అంబులెన్స్.. దీన్ని ఎవరు నడుపుతున్నారో తెలుసా?