ప్రాణాలు కాపాడుతున్న ఎయిర్ అంబులెన్స్.. దీన్ని ఎవరు నడుపుతున్నారో తెలుసా?
Air ambulance | రెండు నెలల పసికందు. పుట్టుకతోనే ఊపరితిత్తుల సమస్య. ఏ క్షణంలో అయినా, గుండె ఆగిపోయే ప్రమాదం ఉన్నది. ప్రమాదపు అంచుల్లో పసి ప్రాణం తల్లడిల్లుతున్నది. వెంటనే, హాస్పిటల్‌కు తీసుకెళ్లకపోతే.. ఏమైనా జరగవచ్చు. అప్పుడే ఒక విమానం వచ్చింది. వందల కిలోమీటర్ల దూరంలోని గమ్యానికి కొద్ది గంటల్లో తీసుకెళ్లింది. మొత్తానికి పాప క్షేమం. ఈ పుణ్యం ఎవరిది? ఆ విమానం ఎక్కడిది?

ఇదొక ఎయిర్ అంబులెన్స్ కథ. ఏ ఒక్కరి ప్రాణాలూ గాల్లో కలిసిపోవద్దనే ఉద్దేశంతో.. ఆకాశమే హద్దుగా మానవత్వాన్ని చాటుతున్న రెక్కల రథం కథ. శిశువు ఉన్నది గుర్‌గ్రామ్‌లో. వెళ్లాల్సింది చెన్నై. పాపం! చిన్న ప్రాణానికి పెద్ద కష్టమే వచ్చింది. ఊపిరితిత్తులు పాడయ్యాయి. ఆ ప్రభావం గుండెకూ నష్టం చేసింది. కొద్ది గంటలే మిగిలి ఉన్నాయి. నాణ్యమైన చికిత్స అందాలంటే మాత్రం తక్షణం చెన్నై వెళ్లాల్సిందే.

నాలుగు గంటల్లోనే
గుర్‌గ్రామ్ నుంచి చెన్నైకి 2,161 కిలోమీటర్ల దూరం. రోడ్డు మార్గంలో 33 గంటల ప్రయాణం. పాప బతకాలంటే నాలుగైదు గంటల్లోనే హాస్పిటల్‌కు చేరుకోవాలి. దాదాపుగా ఆశలు వదిలేసుకుంటున్న దశలో.. ఆపద్బాంధవిలా వచ్చింది.. ఏరో కేర్. ఇదొక ఎయిర్ అంబులెన్స్. కేవలం మూడు గంటల, 50 నిమిషాల్లోనే పాపను చెన్నై హాస్పిటల్‌కు చేర్చింది. అప్పటికే నియోనేటల్ విభాగ సిబ్బంది పరిస్థితిని కాస్త చక్కదిద్దారు. అప్పటివరకూ పాప వెంటిలేటర్ మీదే ఉంది. వారం రోజుల్లో ఆ చిన్నారి కోలుకుంది. నవ్వుకుంటూ ఇంటికి చేరింది. ఏరో కేర్ అంబులెన్స్‌కు కృతజ్ఞతలు.

ప్రత్యేక ఐసొలేషన్
ఎయిర్ అంబులెన్స్‌ను ఒక హాస్పిటల్‌లా తీర్చిదిద్దారు డాక్టర్ వివేక్ కుమార్, అనూష దంపతులు. రోగుల నుంచి పైలట్లకు ఇన్ఫెక్షన్ వ్యాపించకుండా వైద్య సిబ్బందికి, రోగుల సంరక్షకులకు విమానంలోనే ప్రత్యేక ఐసోలేషన్ ప్యాడ్లను అందించారు. ఆక్సిజన్ సిలిండర్లు అమర్చారు. కరోనా సంక్షోభ సమయంలో 25-50 సంవత్సరాల వయసు వారే ‘ఏరో కేర్’ సేవలను ఎక్కువగా ఉపయోగించుకున్నారని చెబుతారు డాక్టర్ వివేక్, అనూష.

రుణ సౌకర్యమూ
రోగులను రోడ్డు మార్గంలో తరలించడానికి గ్రౌండ్ అంబులెన్స్ సముదాయమూ ఉంది. దూరం, సమయం, రోగి ఆరోగ్య స్థితి తదితర అంశాల ఆధారంగా ఏ మార్గాన్ని ఎంచుకోవాలన్నది నిర్ణయిస్తారు. ప్రైవేట్ చార్టర్ విమానాలను లీజుకు తీసుకున్నా, ఖర్చులను తగ్గించుకోవడానికి వాణిజ్య విమానయాన సంస్థలతో కూడా టై-అప్ అయ్యారు. రోగి పరిస్థితి విషమంగా లేకపోతే.. సాధారణ విమానాలలోనే తీసుకెళ్తారు. సపర్యల కోసం మెడికల్ ఎస్కార్ట్ సేవను కూడా అందిస్తున్నారు. బ్యాంకింగ్ సంస్థల ద్వారా రుణాలు ఇప్పిస్తున్నారు. నెలసరి రుణ వాయిదా వెసులుబాటును కల్పిస్తున్నారు.

సెకండ్ వేవ్‌లో 100 మందికి
‘ఏరోకేర్’ సర్వీస్‌ను డాక్టర్ వివేక్ కుమార్, అనూష దంపతులు ప్రారంభించారు. దేశంలో ఎయిర్ అంబులెన్స్ సేవలకు వీరు మార్గదర్శకులు. కొవిడ్ మొదటిరెండు దశల్లో ఎంతోమంది ప్రాణాలు కాపాడారు. కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో హాస్పిటల్స్‌లో పడకలు లేవు. ఒకవేళ ఉన్నా రెమిడిసెవిర్, ఆక్సిజన్ అందక చాలా అవస్థలు పడ్డారు. దేశంలో విమానాల రాకపోకలూ ఆగిపోయాయి. కానీ ఏరోకేర్ సేవలు మాత్రం కొనసాగాయి. హృద్రోగం, మూత్రపిండ సమస్యలు తదితర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రోగులకు కూడా ఆ సమయంలో తీవ్ర సమస్యలు ఎదురయ్యాయి. వారిని కూడా ఏరోకేర్ కాపాడింది. సెకండ్ వేవ్‌లో 100మందిని ఎయిర్ అంబులెన్స్ ద్వారా హాస్పిటల్స్‌కు తరలించారు.
‘త్వరలోనే మరిన్ని దవాఖానలతో అనుసంధానం అవుతున్నాం. భారతదేశానికి మెడికల్ టూరిజం హబ్‌గా ఎంతో పేరు ఉంది. ఒక ఆసుపత్రి నుంచి మరో ఆసుపత్రికి తరలించడానికి కూడా మా వంతు సహకారం అందిస్తున్నాం’ అంటారు వివేక్-అనూష.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Jobs | నిరుద్యోగులకు ఓ ఉపాధ్యాయుడి కానుక.. లైబ్రరీ, వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి మరీ..
recykal | ఆలోచన అదుర్స్.. యాప్‌లతో చెత్త సేకరించే స్టార్టప్
సమాజం కోసం 22 ఏండ్లు త్యాగం.. ఆస్తులు అమ్మి మరి తోటివారికి సాయం
కన్నబిడ్డలు కాదనుకున్న అమ్మానాన్నలకు కొడుకు అయ్యాడు
Ira singhal | దివ్యాంగురాలైనా ఆమె ఎంతోమందికి ఇన్స్పిరేషన్.. ఐఏఎస్ సాధించడమే కాదు..
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

