Man Wears Underwear as Face Mask | మహిళ అండర్‌వేర్‌ను మాస్క్‌గా ధరించి విమానం ఎక్కాడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
మహిళ అండర్‌వేర్‌ను మాస్క్‌గా ధరించి విమానం ఎక్కాడు | వెంటనే అతడిని విమానం దిగాల్సిందిగా సిబ్బంది కోరినా అతడు వాళ్ల మాట వినలేదు. దీంతో వెంటనే ఎయిర్పోర్ట్ పోలీసులకు సమాచారం అందించడంతో వాళ్లు రంగంలోకి దిగాల్సి వచ్చింది.
Man Wears Underwear as Face Mask | ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మరో వేరియంట్ భయపెడుతోంది. దీంతో మాస్క్‌లకు కంపల్సరీ చేశారు. ఒమిక్రాన్ భయంతో ప్రపంచమంతా మరోసారి అల్లాడుతోంది. అందుకే.. అన్ని దేశాలు అలర్ట్ అయ్యాయి. ఖచ్చితంగా ప్రజలంతా మాస్కులు ధరించాలని.. మాస్కులు లేకుండా బయటికి వచ్చినా.. ప్రయాణాలు చేసినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాయి ప్రభుత్వాలు.

ఈనేపథ్యంలో ఓ విమాన ప్రయాణికులు.. మహిళ అండర్‌వేర్‌నే మాస్క్‌గా ధరించి విమానం ఎక్కి రచ్చరచ్చ చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ఘటన యూఎస్‌లోని ఫ్లొరిడాలో చోటు చేసుకుంది. ఆడమ్ జెన్ని అనే 38 ఏళ్ల వ్యక్తి ఫోర్ట్ లాడర్డలె ఎయిర్‌పోర్ట్‌లో విమానం ఎక్కాడు. అయితే.. విమానం టేకాఫ్ తీసుకునే ముందే.. అతడిని విమానం నుంచి దిగిపోవాలంటూ సిబ్బంది సూచించారు. విమానంలోని ప్రయాణికులు కూడా అతడిని చూసి చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యారు.
దానికి కారణం.. అతడు మహిళ అండర్‌వేర్‌ను మాస్క్‌గా ధరించడమే. వెంటనే అతడిని విమానం దిగాల్సిందిగా సిబ్బంది కోరినా అతడు వాళ్ల మాట వినలేదు. దీంతో వెంటనే ఎయిర్పోర్ట్ పోలీసులకు సమాచారం అందించడంతో వాళ్లు రంగంలోకి దిగాల్సి వచ్చింది.
LEAVE IT TO THE #FLORIDAMAN! This guy from Cape Coral tried wearing a #thong as a #mask on a United flight in Fort Lauderdale today. He was kicked off the plane. TSA and sheriff were called but passengers remained peaceful. #airtravel #Florida #aviation #travel pic.twitter.com/kUnkXrgTY8
— Channing Frampton (@Channing_TV) December 16, 2021
విమానాల్లో కూడా మాస్క్‌లు ధరించాలా? ఇదెక్కడి విడ్డూరం. ప్యాసెంజర్లను ఫోర్స్ చేసి మరీ మాస్క్‌లు పెట్టుకునేలా చేస్తున్నారు. ఫుడ్ తీసుకునేటప్పుడు మాత్రం మాస్క్ తీసేయొచ్చట.. అందుకే నేను మహిళ అండర్‌వేర్‌ను ధరించి నిరసన తెలిపాను. నేను వేరే విమానాల్లో కూడా అండర్‌వేర్‌నే ఫేస్ మాస్క్‌గా ధరించా. వాళ్లకు ఎటువంటి అభ్యంతరం అనిపించలేదు. అది కూడా మాస్కే. దాని పని అది చేస్తుంది అన్నారు. కానీ.. వీళ్లకు మాత్రమే ఎందుకు అభ్యంతరం అనిపించిందో.. అని ఓ లోకల్ న్యూస్ చానెల్‌కు ఆడమ్ తెలిపాడు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా మిశ్రమంగా ఈ ఘటనపై స్పందిస్తున్నారు. అది మాస్క్ ఎలా అవుతుంది.. అండర్వేర్ అవుతుంది కానీ.. మాస్క్ పెట్టుకోవడానికి వచ్చిన ఇబ్బంది ఏంటో.. విమానాల్లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలి.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Monkeys Kill Dogs | 250 కుక్కలను వేటాడి మరీ చంపేసిన కోతులు.. కారణం ఏంటో తెలుసా?
MP Brijbhushan: యువ రెజ్లర్‌ను చెంపదెబ్బలు కొడుతూ కెమెరా కంటికి చిక్కిన ఎంపీ.. వీడియో
అయ్యో తాత.. ఈ వయసులో నీకు ఎంత కష్టం వచ్చింది.. సైకిల్‌పై పోహ అమ్ముతూ జీవనం
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

