70 ఏళ్ల వయసులో ఏం పని చేయగలుగుతారు చెప్పండి. కాటికి కాలు చాపే వయసు అది. కానీ.. ఆ వయసులో కూడా రాత్రింబవళ్లు పనిచేస్తేనే మూడు పూటల తిండి దొరికే వాళ్లు కోకొల్లలు. వాళ్లలో ఈ తాత ఒకరు. ఆయన వయసు 70 ఏళ్లు. నాగ్‌పూర్‌కు చెందిన జయంతి భాయ్ రోజూ సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు పోహా, చనా, చివ్డా అమ్మితేనే తనకు మూడు పూటలా తిండి దొరుకుతుంది. రాత్రి పూట సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తాడు తాత. ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండడు. ఏదో ఒక పని చేస్తూ ఈవయసులో జీవన పోరాటం సాగిస్తున్నాడు.
నాగ్‌పూర్ వీధుల్లో సైకిల్ తీసుకొని నడుస్తూ.. పోహ, చన, చివ్డా అంటూ ఆ పెద్దాయన అమ్ముతూ ఉంటాడు. పెద్దాయనను చూసిన ఓ వ్యక్తి.. ఆ వృద్దుడి కష్టాన్ని చూసి వీడియో తీసి.. నాగ్‌పూర్‌లో ఉన్న వాళ్లు ఆయనకు గిరాకీ చేసి సాయం చేయాలంటూ కోరాడు. దీంతో నెటిజన్లు కూడా పాజిటివ్‌గానే స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Halwa Paratha | హల్వా పరాటా ట్రై చేశారా ఎప్పుడైనా? ఎలా తయారు చేస్తారో తెలుసా? వైరల్ వీడియో
Drink Chai And Eat Cup | చాయ్ తాగి అదే కప్పును తినేయొచ్చు.. హైదరాబాద్ కంపెనీ వినూత్న ప్రయత్నం
Ima Keithel | ఏసియాలోనే అతిపెద్ద మహిళల మార్కెట్.. అందరూ మహిళా వ్యాపారులే