Ima Keithel | ఏసియాలోనే అతిపెద్ద మహిళల మార్కెట్.. అందరూ మహిళా వ్యాపారులే
ఏసియాలోనే అతిపెద్ద మహిళల మార్కెట్ | ఇంతకీ ఈ మార్కెట్ ఎక్కడుంది అంటారా? మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో ఈ మార్కెట్ ఉంది. ఈ మార్కెట్‌కు 500 ఏళ్ల చరిత్ర ఉంది. 16వ శతాబ్దంలో ఈ మార్కెట్‌ను ప్రారంభించారు

Ima Keithel | ఇమా కైతెల్ లేదా ఇమా మార్కెట్ లేదా మదర్స్ మార్కెట్ లేదా నుపి కైతెల్. పేరు ఏదైనా.. అది ఏసియాలోనే అతిపెద్ద మహిళల మార్కెట్. అక్కడ ఎక్కడ చూసినా మహిళలే కనిపిస్తారు. మహిళా వ్యాపారులు తప్పితే మగవాళ్లు కనిపించరు. మహిళలకే ఆ మార్కెట్లో వస్తువులను అమ్మే అవకాశం ఉంటుంది. అది కూడా పెళ్లయిన మహిళలకు మాత్రమే.
ఇంతకీ ఈ మార్కెట్ ఎక్కడుంది అంటారా? మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో ఈ మార్కెట్ ఉంది. ఈ మార్కెట్‌కు 500 ఏళ్ల చరిత్ర ఉంది. 16వ శతాబ్దంలో ఈ మార్కెట్‌ను ప్రారంభించారు. అప్పుడు కూడా కొందరు మహిళలే ఈ మార్కెట్‌ను స్టార్ట్ చేశారు. స్వాతంత్య్రం వచ్చాక.. ఆ మార్కెట్ విస్తరించింది. చాలామంది మహిళలు అక్కడ ట్రేడర్స్ అయ్యారు. పలు రకాల ఉత్పత్తులను అమ్మడం ప్రారంభించారు. ఇంటి ఉపకరణలు, టెక్స్టైల్స్, హాండీక్రాఫ్ట్స్, కూరగాయలు, మాంసం లాంటి ఉత్పత్తులను ఆ మార్కెట్లో అమ్ముతుంటారు.

మహిళలే యూనియన్ను ఏర్పాటు చేసుకున్నారు. వాళ్లే కొన్ని రూల్స్ కూడా పెట్టుకున్నారు. ఎవరైనా మహిళ ఆ మార్కెట్లో వ్యాపారం చేయాలంటే.. ఖచ్చితంగా పెళ్లయి ఉండాలి. వాళ్లు లోన్ తీసుకొని ఆ మార్కెట్లో వ్యాపారం చేస్తుంటారు. అలా.. ఆ మార్కెట్ బాగా విస్తరించి ఇప్పుడు ఏసియాలోనే అతి పెద్ద మహిళా మార్కెట్‌గా చరిత్ర సృష్టించింది.
ఇప్పుడు అక్కడ ఇంఫాల్ మునిసిపల్ కౌన్సిల్.. 4 అంతస్థుల బిల్డింగ్‌ను నిర్మించింది. ఆ బిల్డింగ్‌లోనే మహిళలు షాపులు పెట్టుకున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Chocolate statue: చాక్లెట్‌తో భారీ విగ్రహం తయారీ.. ఎక్కడో తెలుసా..?
Ectopic Pregnancy | వైద్యశాస్త్రానికే సవాల్.. మహిళ కాలేయంలో పెరుగుతున్న శిశువు
Momo Paratha | మోమో పరాటా తిన్నారా ఎప్పుడైనా? టేస్ట్ ఎలా ఉంటుందో తెలుసా? వైరల్ వీడియో
TV Star | ఒక్క వారంలోనే 37 లక్షలు సంపాదించిన టీవీ సెలబ్రిటీ.. ఎలాగో తెలిస్తే నోరెళ్లబెడతారు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

