హైదరాబాద్: సాధారణంగా భారీ విగ్రహాలను నిర్మించడానికి మట్టిని, సిమెంటును, ఇత్తడిని, రాగిని, పాలరాతిని, ఆఖరికి వెండి, బంగారాన్ని కూడా వినియోగిస్తారు. కానీ, పుదుచ్చేరిలోని ఓ బేకరి నిర్వాహకులు మాత్రం గత కొన్నేండ్లుగా డార్క్ చాక్లెట్‌ను ఉపయోగించి విగ్రహాలను తయారు చేస్తున్నారు. ప్రతి ఏడాది క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలకు ముందు ప్రముఖ వ్యక్తులకు సంబంధించిన చాక్లెట్ విగ్రహాలను రూపొందిస్తున్నారు.
తాజాగా ఈసారి కూడా డార్క్ చాక్లెట్‌తో మహాకవి భారతీయార్ విగ్రహాన్ని తయారు చేశారు. ఈ విగ్రహాన్ని 6.6 అడుగుల ఎత్తుతో సిద్ధం చేశారు. తాము ప్రతి ఏడాది క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకుల సందర్భంగా డార్క్ చాక్లెట్‌తో ప్రముఖ వ్యక్తుల విగ్రహాలను తయారు చేస్తున్నామని, అదేవిధంగా ఈసారి కూడా చేస్తున్నామని బేకరి నిర్వాహకుడు తంగమ్తెన్నరసు చెప్పారు.
A Puducherry-based bakery has made a 6.6-feet tall statue of Mahakavi Bharathiyar using dark chocolate, ahead of Christmas celebrations in the city
— ANI (@ANI) December 17, 2021
"Every year, we create statues of eminent personalities from chocolate before Christmas and New Year," says baker Thangamtennarasu pic.twitter.com/LECZaWVTw4