Ectopic Pregnancy | వైద్యశాస్త్రానికే సవాల్.. మహిళ కాలేయంలో పెరుగుతున్న శిశువు
మహిళ కాలేయంలో పెరుగుతున్న శిశువు | గర్భాశయం వెలుపల.. అండం తనకు తానే ఫలదీకరణం చెందడం వల్ల ఇలాంటి గర్భం వచ్చే అవకాశం ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు.
సాధారణంగా మహిళలు గర్భం దాల్చినప్పుడు.. కడుపులోని బిడ్డ తన గర్భాశయంలో పెరుగుతుంది. ఏ మహిళ అయినా సరే.. తన బిడ్డను తన గర్భాశయంలోనే మోస్తుంది. కానీ.. ఈ మహిళకు మాత్రం తన కడుపులోని బిడ్డ కాలేయంలో పెరుగుతున్నాడు. వైద్యశాస్త్రానికే సవాల్ విసిరిన ఈ ఘటన కెనడాలో చోటు చేసుకుంది. ఈ అరుదైన గర్భాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ(Ectopic Pregnancy) అంటారు. అంటే గర్భాశయం బయట పిండధారణ జరగడం అన్నమాట.

ఇటువంటి ప్రెగ్నెన్సీ కోట్లలో ఒకరిద్దరికి మాత్రమే వస్తుందట. ఇది చాలా అసాధారణమైన ఘటన అని చిల్డ్రన్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డాక్టర్లు చెబుతున్నారు. 33 ఏళ్ల మహిళ తనకు వరుసగా 14 రోజుల నుంచి రుతుస్రావం అవుతోందని ఆసుపత్రికి చెందిన మైకెల్ నార్వే అనే డాక్టర్ వద్దకు చెకప్‌కు వెళ్లింది. దీంతో ఆ మహిళకు అల్ట్రాసౌండ్ స్కాన్ చేయడంతో తన కాలేయంలో పిండం ఉన్నట్టు డాక్టర్ గుర్తించాడు.
ఇటువంటి అరుదైన గర్భం గురించి ఆ డాక్టర్ టిక్‌టాక్‌లో వీడియో పోస్ట్ చేశాడు. అందులో.. ఆ గర్భం గురించి వివరించాడు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాలేయంలో కూడా బిడ్డ పెరుగుతాడా? అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
గర్భాశయం వెలుపల.. అండం తనకు తానే ఫలదీకరణం చెందడం వల్ల ఇలాంటి గర్భం వచ్చే అవకాశం ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు.
నిజానికి అండాశయం నుంచి గర్భకోశానికి ఒక పైప్లాంటి మార్గం ఉంటుంది. ఆ మార్గం ద్వారా గర్బాశయానికి అండాలు ప్రయాణం చేస్తాయి. మధ్యలో ఏ అండం అయినా ఇరుక్కుపోతే.. అక్కడే పిండంలా ఏర్పడుతుంది. కానీ.. ఆ పిండంలో ఎదుగుదల ఉండదు. అటువంటి గర్భం కూడా నిలబడదు. ఈ మహిళ విషయంలో కూడా అదే జరిగింది. కానీ.. ఇటువంటి కేసులు చాలా అరుదుగా ఉంటాయని డాక్టర్లు స్పష్టం చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Momo Paratha | మోమో పరాటా తిన్నారా ఎప్పుడైనా? టేస్ట్ ఎలా ఉంటుందో తెలుసా? వైరల్ వీడియో
TV Star | ఒక్క వారంలోనే 37 లక్షలు సంపాదించిన టీవీ సెలబ్రిటీ.. ఎలాగో తెలిస్తే నోరెళ్లబెడతారు
Seoul Milk | మహిళలను ఆవులుగా చూపిస్తూ యాడ్ తీశారు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? వైరల్ వీడియో
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

